Revanth Reddy : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ కు 45, BRS కు 45 సీట్లు

Revanth Reddy
Revanth Reddy

Revanth Reddy Comments on telangana elections

Revanth Reddy : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కు 45, BRS కు 45 సీట్లు వస్తాయని కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మీడియాతో చిట్‌ చాట్‌ చేసి…. సర్వే లెక్కలను బయటపెట్టారు. కాంగ్రెస్‌ పార్టీ సర్వే చేస్తోందని.. ఇప్పటి వరకు వచ్చిన సర్వేలో brs.. కాంగ్రెస్ సమానంగా ఉందని వ్యాఖ్యనించారు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ( Revanth Reddy  ).

ఇప్పటి వరకు వచ్చిన సర్వే లెక్కల ప్రకారం… 45 సీట్లు కాంగ్రెస్ పార్టీ.. 45 brs పార్టీ గెలుస్తుందని స్పష్టం చేశారు. బీజేపీ..mim పార్టీలకు చెరో ఏడు సీట్లు వస్తాయని తేల్చి చెప్పారు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. ఇక బీజేపీ 22 ఓటింగ్‌ శాతం నుంచి 14 శాతానికి పడిపోయిందన్నారు. కర్ణాటక ఫలితాల తరువాత బీజేపీ పార్టీ గ్రాఫ్ పడిపోయిందని కుండ బద్దలు కొట్టి చెప్పారు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. మరో 15 సీట్లలో brs పార్టీకి… కాంగ్రెస్ పార్టీకి మధ్య గట్టి పోటీ ఉందని చెప్పారు.

Revanth Reddy
Revanth Reddy

Brs పార్టీకి 37 శాతం ఓట్ షేర్ ఉందని… కాంగ్రెస్ 35 శాతం ఓట్ షేర్ వచ్చిందని స్పష్టం చేశారు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. హరగోపాల్ పై కేసు వెనక్కి తీసుకోవాలని కేసీఆర్ చెప్పడాన్ని నేను నమ్మనని… విచారణ అధికారి.. చార్జీ షీట్ ఫైల్ చేసినప్పుడు నివేదికలో ఆ ప్రస్తావన ఉండాలని ఫైర్‌ అయ్యారు.

అప్పుడే దానికి లీగల్ గా ప్రామాణికమని.. అలా లేకుంటే… అది సమస్యే అంటూ వ్యాఖ్యానించారు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. తెలంగాణ సీఎం కేసీఆర్ మోసం చేయడానికే ఇలాంటి స్టేట్మెంట్ చేస్తున్నారని ఆగ్రహించారు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. 80 వేల పుస్తకాలు చదివిన తెలంగాణ సీఎం కేసీఆర్ కు అది తెలియదా..? అందరినీ పిచ్చివాళ్లను చేస్తూన్నారని అని ఆగ్రహించారు.