Ashadam: రేపే ఆషాడం ప్రారంభం.. కొత్తగా పెళ్లయిన భార్యాభర్తల్ని ఈ నెలలో దూరంగా ఉంచడానికి కారణం..?

Ashadam

Ashadam: The reason for keeping newly married husband and wife away this ashadam month

Ashadam: రేపటితో ఆషాడ మాసం మొదలవుతుంది. ఆషాడ మాసంలో అనేక రకాల నియమాలు పాటిస్తారు. మరీ ముఖ్యంగా కొత్త దంపతులను ఆషాడ మాసంలో దూరంగా ఉండమని చెబుతారు. అయితే ఇది పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం. కానీ దీన్ని చాలా మంది మూఢనమ్మకం అని నమ్ముతుంటారు. కానీ దీని వెనక అసలు రహస్యం వేరే ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Ashadam

ఆషాడంలో నవ దంపతులు దూరంగా ఉండడానికి ప్రధాన కారణం ఆషాడ మాసంలో భార్య భర్తలు కలయిక వల్ల ఒకవేళ భార్యకి గర్భం వస్తే 9 నెలలు నిండే సరికి ఎండాకాలం వస్తుంది. మరి ముఖ్యంగా మార్చి నుండి మే నెలలో ప్రసవం జరుగుతుంది. ఇలా జరగడం వల్ల పుట్టిన బిడ్డకి తల్లికి ఇద్దరికీ హాని కలుగుతుంది.

ఎందుకంటే ఎండాకాలంలో వడగాలులు,తీవ్రమైన ఎండ వల్ల పుట్టిన బిడ్డకి అనేక రకాల వ్యాధులు వస్తాయి.అంతేకాకుండా ఆ తర్వాత వర్షాకాలంలో కూడా చిన్నపిల్లలకు అనేక రకాల వ్యాధులు వస్తాయి.వాటిని తట్టుకునే శక్తి ఉండదు. అందుకే ఆషాడ మాసంలో భార్యాభర్తలను కలవనివ్వకూడదు అంటారు.

కొత్తగా పెళ్లయిన అమ్మాయిలను పుట్టింటికి పంపిస్తారు.అలాగే అత్తారింటికి ఆషాడమాసంలో అల్లుడు వెళ్లకూడదు అని చెబుతారు.ఈ కారణంతోనే పెళ్లయిన నవ దంపతులను ఆషాడ మాసంలో విడదీస్తారు. కానీ ఈ విషయం తెలియని కొంతమంది రకరకాల ప్రచారాలు చేస్తారు.