PoojaHegde: ఇండస్ట్రీలో పూజా హెగ్డే ని తొక్కేయాలని చూస్తుంది ఎవరు..?

PoojaHegde

Who wants to trample PoojaHegde in the industry..?

PoojaHegde: ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన ముద్దుగుమ్మ పూజ హెగ్డే గురించి, ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతేడాది వరకు టాలీవుడ్ లో నెంబర్ వన్ స్టార్ హీరోయిన్ అయిన పూజా హెగ్డే.. బాలీవుడ్ లో సైతం అడుగుపెట్టి వరుస అవకాశాలతో దూసుకెంది. కానీ ఇటీవల ఈ బుట్టబొమ్మని ఫ్లాప్ లు చుట్టుముట్టాయి.

టాలీవుడ్ లో దాదాపు అగ్ర హీరోలు అందరితో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ సినిమాలు ఈ మధ్యకాలంలో ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఆమెను తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ఆమె అభిమానులు మాత్రం కావాలనే పూజ కొన్ని సినిమాల నుంచి తప్పుకుందని అంటున్నారు. ఇందులో ఏది నిజమో తెలియదు కానీ స్టార్ హీరోల సినిమాలను అయితే వదులుకుంది ఈ బుట్టబొమ్మ.

ఈమె వదులుకున్న సినిమాలలో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఒకటి. ఈ సినిమాలో మొదట పూజాహెగ్డే నే హీరోయిన్ అంటూ పలు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఆ ప్లేస్ లోకి యంగ్ బ్యూటీ శ్రీలీల వచ్చి చేరింది. ఇక లైగర్ తర్వాత పూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా జనగణమన అనే సినిమా అనౌన్స్ చేసిన సమయంలో హీరోయిన్ గా పూజాని ఎంపిక చేశారు. కానీ లైగర్ ప్లాప్ వల్ల ఈ సినిమా ఆగిపోయింది.

ఆ తరువాత పరశురాం – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో మొదట పూజా హెగ్డే నే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆ ప్లేస్ లో మృనాల్ ఠాకూర్ వచ్చి చేరింది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా ఒకటి మాత్రమే ఉంది. అయితే ఈ సినిమాలని కావాలనే పూజ వదులుకుందా..? లేక ఇండస్ట్రీలో ఆమెను తొక్కేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయా..? అనేది తెలియాల్సి ఉంది.