bandi sanjay comments on cm kcr
Cm Kcr : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకి హాట్ హాట్ గా మారిపోతున్నాయి. మరికొన్ని నెలల్లోనే అంటే మరో ఐదు నెలల్లోనే.. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ తరుణంలో… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ( Cm Kcr ) ను ఓడించేందుకు.. రెండు జాతీయ పార్టీలు అయిన బిజెపి మరియు కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీ పడుతున్నాయి.
బీఆర్ఎస్ పార్టీకి.. పోటీ తామంటే తాము అని… ఆ పార్టీని ఓడించేది తామేనని… ఇప్పటినుంచే ఛాలెంజ్ లు విసురుకుంటున్నాయి కాంగ్రెస్ మరియు బిజెపి లు. ఇలాంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో… బీఆర్ఎస్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీలు… కలిసి పోటీ చేయబోతున్నట్లు బాంబు పేల్చారు బండి సంజయ్.
ఈ పార్టీలు ఒకటేనని… అసలైన హిందువుల కోసం పోరాడే పార్టీ బిజెపి పార్టీ అని ఆయన వెల్లడించారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో 30 మంది అభ్యర్థులను గెలిపించేందుకు సీఎం కేసీఆర్ తన సొంత డబ్బులను వారికి ఇచ్చాడని సంచలన ఆరోపణలు చేశారు బండి సంజయ్ కుమార్. అలా 30 మంది కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి… తెలంగాణలో మరోసారి అధికారంలోకి రావాలని సీఎం కేసీఆర్ స్కెచ్ వేసినట్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి తారాస్థాయికి చేరిందని… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి.. బిజెపి పార్టీ చుక్కలు చూపిస్తుందని వార్నింగ్ ఇచ్చారు బండి సంజయ్ కుమార్. ఈ సెక్యులర్ పార్టీలన్నీ ఒకటై బిజెపిని ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాత్రం బిజెపికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని… కచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యాన్ని తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్.