Did Rakesh Master life become like that because of that hero..?
Rakesh master: టాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్ గా కీర్తి గడించిన రాకేష్ మాస్టర్ ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. నిత్యం ఎవరో ఒకరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తలలో నిలిచే రాకేష్ మాస్టర్ ఇప్పుడు ఈ లోకం నుండి శాశ్వతంగా నిష్క్రమించారు. దాదాపు చాలామంది స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఆయన 1500 వందలకు పైగా పాటలకు డ్యాన్సులు కంపోజ్ చేశారు.
1990 -20 లో స్టార్ కొరియోగ్రాఫర్ గా రాణించారు. గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ కూడా పొందారు. ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాలతో ఆయన క్రేజ్ తగ్గుతూ వచ్చింది. తన అనుకున్న వాళ్లు ఒక్కొక్కరిగా మరణించడం, భార్య దూరం పెట్టడంతో ఆయన జీవితం అతలాకుతలమైందని చెప్పాలి. చివరి క్షణాలలో అనాధ ఆశ్రమంలో బ్రతికిన ఆయన ఆదివారం రోజున అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారు. అయితే రాకేష్ మాస్టర్ మరణించడంతో ఆయనకు సంబంధించిన ప్రతి విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఆయన గతంలో అవకాశాల కోసం వెతుకుతున్న సమయంలో ఆయన కెరీర్ ని మార్చేసిన ఓ హీరో గురించి ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆ హీరో లేకపోతే తన జీవితం ఉండేది కాదని, ఆయన వల్లే తన కెరీర్ ఇంత ఉన్నత స్థాయికి చేరిందని రాకేష్ మాస్టర్ చెప్పిన విషయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు.. వేణు తొట్టెంపూడి. కెరీర్ మొదట్లో జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ, ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న రాకేష్ మాస్టర్ కి వేణు పిలిచిమరి అవకాశం ఇచ్చారట.
ఆ క్షణాలను తన జీవితంలో మరిచిపోలేనని, వేణు సార్ వల్లే కొరియోగ్రాఫర్ గా సినిమాలలో నిలదొక్కుకోగలిగానని అన్నారు రాకేష్ మాస్టర్. ఇక వేణు హీరోగా నటించిన చిరునవ్వుతో సినిమాలో ” నిన్నలా మొన్నలా లేదురా” అనే సాంగ్ కి గానే కొరియోగ్రఫీ చేశానని.. అదే తన మొదటి కొరియోగ్రఫీ అని చెప్పుకొచ్చారు. వేణు సార్ వల్లే తన జీవితం చాలా గొప్పగా మారిందని రాకేష్ మాస్టర్ తెలిపారు.