Numerology: Girls born on this date are very lucky
Numerology: భారత దేశంలో జ్యోతిష్య శాస్త్రం, స్వప్న శాస్త్రం,వాస్తు శాస్త్రం వంటి వాటికి ఎంత ప్రాముఖ్యత అయితే ఉందో సంఖ్యా శాస్త్రానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక మనిషి భవిష్యత్తును ఎలా అయితే నిర్ధారిస్తారో సంఖ్య శాస్త్రం (Numerology) బట్టి కూడా వారి భవిష్యత్తును ఊహించవచ్చు. పుట్టిన తేదీని బట్టి భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పవచ్చు. అయితే ఈ తేదీలో పుట్టిన అమ్మాయిలు చాలా అదృష్టవంతులు అవుతారని న్యూమరాలజీ చెబుతోంది. మరి ఆ తేదీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ర్యాడిక్స్ 3 ఉన్న అమ్మాయిలు చాలా అదృష్టవంతులట. ఏదైనా నెలలో 3,12,21,30 వంటి తేదీలలో పుట్టిన అమ్మాయిలకు ర్యాడిక్స్ 3గా ఉంటుంది. ఇక ర్యాడిక్స్ 3గా ఉన్న అమ్మాయిలు ఏ రంగంలో అడుగు పెట్టినా కూడా మంచి సక్సెస్ అందుకుంటారట. వీళ్లు కోడలుగా ఏ ఇంట్లో అడుగుపెట్టినా వారి కుటుంబం చాలా సుఖసంతోషాలతో ముందుకు పోతుందట.
ఇక వీళ్లు చదువు పరంగా కూడా ఎన్నో ఉన్నత చదువులు చదివి గొప్ప గొప్ప స్థానాలలో స్థిరపడతారట.మరీ ముఖ్యంగా ర్యాడిక్స్ 3 ఉన్న అమ్మాయిల్లో మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయట. అంతేకాకుండా ఈ అమ్మాయిల్లో కేవలం నాయకత్వ లక్షణాలు, మంచి విద్య మాత్రమే కాకుండా ఈ అమ్మాయిల్లో తెలివి అలాగే దయాగుణం కూడా ఎక్కువగా ఉంటుందట. వీళ్ళు ఏ పనిని ఇచ్చినా కూడా సక్సెస్ఫుల్గా దాన్ని నెరవేరుస్తారట.
అంతేకాకుండా వీరు కేవలం తమ కోసమే కాకుండా ఇతరులకు కూడా సహాయం చేసే గుణం ఉంటుందట. వీరిలో ఉండే సేవాగుణం వల్ల సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారట. అందుకే ర్యాడిక్స్ 3ఉన్న అమ్మాయిలు పురుషుల జీవితంలోకి వెళ్తే వారి జీవితం కూడా సుఖమయం అవుతుందట. మరి మీ పుట్టిన తేదీ ర్యాడిక్స్ 3 కలిగి ఉంటే మీలో ఈ లక్షణాలు ఉన్నాయో లేవో ఒకసారి చూసుకోండి.