Astrology : Does the pumpkin really have the power to ward off evil spirits
Astrology: పల్లెటూరులో ప్రతి ఒక్కరి ఇంటి ముందు గుమ్మానికి బూడిద గుమ్మడికాయ వేలాడుతూ కనిపిస్తుంది. అయితే ఇది పట్టణాల్లో కూడా కనిపిస్తుంది. కానీ చాలా తక్కువ మంది దీన్ని పాటిస్తూ ఉంటారు. అయితే బూడిద గుమ్మడికాయని ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే నిజంగానే మంచి జరుగుతుందా? దుష్టశక్తులను అడ్డుకునే శక్తి బూడిద గుమ్మడికాయ ఉందా?అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
చాలామంది ఇంటిపై చెడు దృష్టి పడకుండా, దిష్టి తగలకుండా ఉండడానికి ఇంటి ప్రధాన ద్వారానికి గుమ్మానికి బూడిదగుమ్మడికాయని కడుతూ ఉంటారు. ఇక బూడిద గుమ్మడికాయ సంవత్సరం వరకు చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అలాగే బూడిద గుమ్మడికాయకు నిజంగానే ఇంటి పై చెడు దృష్టి పడకుండా అడ్డుకునే శక్తి ఉంటుందట.
ఒకవేళ ఇంటిపై చెడు దృష్టి పడితే ఆ నెగటివ్ దృష్టిని బూడిద గుమ్మడికాయ తీసుకొని పాజిటివ్ ఎనర్జీని ఇంట్లోకి పంపిస్తుందట. అందుకే చాలామంది బూడిద గుమ్మడికాయని ఇంటి ముందు గుమ్మానికి కట్టుకుంటారు.
ఒకవేళ ఇంటికి కట్టిన గుమ్మడికాయ కుళ్ళిపోయి ఉంటే ఆ ఇంటిపై ఏదో చెడు దృష్టి పడిందని తెలుసుకోవాలి.అంతేకాకుండా ఆ పాడైపోయిన గుమ్మడికాయను తీసేసి కొత్త బూడిద గుమ్మడికాయను ఆ ఇంటికి కట్టాలి. అలాగే బూడిద గుమ్మడికాయ కట్టినప్పుడు దీప ధూపాలు వేస్తే అంతా మంచచే జరుగుతుంది.