Chanakya Niti: ఈ ఐదు అలవాట్లు ఉన్న ఆడవాళ్లను ఎప్పటికీ నమ్మకూడదు.. 2ది చాలా ఇంపార్టెంట్.!!

Chanakya Niti

Chanakya Niti : Women with these five habits should never be trusted

Chanakya Niti: చాణుక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా భవిష్యత్తులో జరగబోయే ఎన్నో రకాల విషయాలను ముందే అంచనా వేశారు. మరీ ముఖ్యంగా భార్యాభర్తల బంధం నిలబడడానికి ఈయన ఎన్నో రకాల సూచనలు చేశారు. ఈయన నీతి శాస్త్రం చదివితే భార్య భర్త దగ్గర ఎలా ఉండాలి? భర్త భార్య దగ్గర ఎలా ఉండాలి? అనే విషయం తెలుస్తుంది. అయితే చాణుక్యుడు ఇలాంటి ఆడవాళ్లను అస్సలు నమ్మకూడదు అని తన నీతి శాస్త్రం ద్వారా బోధించాడు.

Chanakya Niti

మరి ఎలాంటి గుణాలు ఉన్న ఆడవాళ్లను నమ్మకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది ఆడవాళ్లకు పొగరు ఇగో అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఆడవాళ్లు తాము చేసిందే కరెక్ట్ అని భావిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వారికి చాలా దూరంగా ఉండటం మంచిది అని చాణుక్యుడు చెబుతున్నారు. ఇక కొంతమంది ఆడవాళ్ళు అయితే డబ్బు మీద ఉన్న ఆశ అలాగే లగ్జరీ లైఫ్ గడపాలి అనే కోరికతో పెళ్లయినా కూడా డబ్బు ఎక్కువగా ఉన్న పురుషుల దగ్గరికి వెళ్తారు.

కానీ ఇలాంటి వారిని ఎప్పుడూ కూడా నమ్మకూడదు. అలాగే ప్రతి విషయానికి గొడవలు పెట్టుకుని కోపంగా అరిచే అమ్మాయిలను కాస్త దూరం పెట్టడం మంచిది అని ఆచార్య చాణుక్యుడు చెబుతున్నాడు. అలాగే అబద్ధాలు చెప్పే ఆడవాళ్లను కూడా అస్సలు నమ్మకూడదట. ఎందుకంటే ఒక స్త్రీ ఒకసారి అబద్ధం చెప్పడం మొదలు పెడితే ఆ అబద్దాన్ని దాచడానికి మరో అబద్ధం ఇలా జీవితం మొత్తం అబద్దాలతోనే గడిపేస్తుంది.

అందుకే ఇలాంటి స్త్రీలను అసలు నమ్మకూడదట. చెప్పుడు మాటలు వినే స్త్రీని కూడా అస్సలు నమ్మకూడదని ఆచార్య చాణుక్యుడు చెబుతున్నారు.ఎందుకంటే బయట వాళ్ళు చెప్పే మాటలు విని ఆ స్త్రీ ఇంట్లో సంసారాన్ని నాశనం చేసుకుంటుందట.అందుకే ఇలాంటి స్త్రీలను ఎప్పుడు కూడా నమ్మకూడదు.