Thaman: మహేష్ బాబుతో విభేదాలు.. షాకింగ్ ట్విట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్

Thaman

Music director Thaman made a shocking tweet

Thaman: దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న హైట్రిక్ మూవీ గుంటూరు కారం. ఈ సినిమాకి ఇంకా కష్టాలు సమసిపోలేదు. ఈ సినిమా మొదలైన రోజు నుండే అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ వస్తుంది. షూటింగ్ మొదలుపెట్టిన వెంటనే క్యాన్సిల్ చేసి, మరో కొత్త కథతో ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇక మహేష్ బాబు విదేశీ టూర్లు, త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమాలకు సాయం.. ఇలా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది.

ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ సినిమా ఇలా షూటింగ్ లు వాయిదా పడడంతో డేట్లు కుదరక ఇప్పుడు ఈ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని సోషల్ మీడియాలో వార్తలు అవుతున్నాయి. మహేష్ బాబుతో తమన్ కి విభేదాలు రావడంతోనే ఈ సినిమా నుంచి తొలగిస్తున్నట్లు కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.

Thaman

సర్కారు వారి పాట సినిమాలో తమన్ అందించిన సాంగ్స్ ఎంత బాగున్నాయో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సరిగా రాలేదని.. తమన్ పనిమీద పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడమే ఇందుకు కారణం అనే టాక్ ఉంది. ఈ కారణంగానే మహేష్ బాబు – తమన్ మధ్య విభేదాలు తలెత్తయట. ఇక గుంటూరు కారం సినిమాకి తమన్ వద్దని మహేష్ పట్టుబట్టాడని ప్రచారం జరుగుతుంది. కానీ ఈలోపు గ్లింప్స్ కి తమన్ మ్యూజిక్ అందించాడు. అలాగే నాలుగు పాటలు కూడా రికార్డు చేశాడట.

ఇప్పుడు తమన్ ని తప్పించడం కుదరదని.. ఈసారి తమన్ ని భరించమని మహేష్ ని త్రివిక్రమ్ రిక్వెస్ట్ చేశాడట. ఈ రూమర్స్ పై తాజాగా తమన్ ట్వీట్ తో కౌంటర్ ఇచ్చారు. వరుసగా రెండు ట్వీట్స్ తో క్లారిటీ ఇచ్చాడు. వలచిన అరటిపండును తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆయన.. కడుపు మంటకు అరటి పండ్లు చాలా మంచి వని కామెంట్ చేశాడు. ఇదే కాకుండా.. “నా స్టూడియో దగ్గర ఒక మజ్జిగ స్టాల్ ను ప్రారంభిస్తున్నాను.

ఎవరైనా కడుపు మంట లక్షణాలతో బాధపడితే వారందరికీ స్వాగతం. కనీసం దీనితోనైనా కోలుకుంటారు. దయచేసి నా సమయాన్ని వృధా చేయకండి. నాకు చాలా పనులు ఉన్నాయి” అని మరో ట్వీట్ చేశాడు. అంటే కొందరు కడుపు మంటతో తనపై రూమర్స్ పుట్టిస్తున్నారు అంటూ అర్థం వచ్చేలా తమన్ పోస్ట్లు ఉన్నాయి. దీంతో గుంటూరు కారం సినిమా నుండి తాను వెళ్లిపోలేదని కన్ఫార్మ్ చేశాడు తమన్.