Ram Charan and Upasana become parents
Ram Charan – Upasana : మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి అలాగే మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులు. తాజాగా.. మెగా కుటుంబానికి వారసురాలిని ఇచ్చింది రామ్ చరణ్ మరియు ఉపాసన జంట. ఇవాళ ఉదయం అంటే జూన్ 20వ తేదీ ఉదయం నాలుగు గంటల సమయంలో… ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది రామ్ చరణ్ భార్య ఉపాసన.
నిన్న సాయంత్రం ఏడు గంటల సమయంలో… మెగా కోడలు ఉపాసనను హైదరాబాదులోని అపోలో ఆసుపత్రి కి తరలించింది మెగా కుటుంబం. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు నిన్నటి నుంచి వైరల్ గా మారిన సంగతి మనందరికీ విధితమే. ఈ వీడియో వైరల్ అయిన 12 గంటల వ్యవధిలోనే… మెగా కుటుంబానికి అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది మెగా కోడలు ఉపాసన. ఇవాళ వేకువ జామున మెగా ప్రిన్సెస్ కు జన్మనిచ్చింది మెగా కోడలు ఉపాసన ( Upasana ). ఈ మేరకు హైదరాబాద్ అపోలో ఆసుపత్రి వైద్యులు అధికారిక ప్రకటన చేశారు.

మెగా కోడలు ఉపాసన అలాగే పుట్టిన ఆడబిడ్డ… చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉన్నారని… ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని… తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని హెల్త్ బులిటెన్ కూడా విడుదల చేశారు హైదరాబాద్ అపోలో ఆసుపత్రి వైద్యులు. ఇక హైదరాబాద్ అపోలో ఆసుపత్రి వైద్యులు చేసిన ప్రకటనతో మెగా కుటుంబంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రామ్ చరణ్ మరియు ఉపాసన జంటలకు శుభాకాంక్షలు చెప్పేందుకు హైదరాబాద్ అపోలో ఆసుపత్రి ముందు… బారులు తీరారు మెగా ఫ్యాన్స్.
ఇక ఆసుపత్రికి వస్తున్న మెగా ఫాన్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది మెగా కుటుంబం. వారు కూర్చునేందుకు.. ఓ గ్యాలరీ కూడా ఆసుపత్రి ముందు ఏర్పాటు చేసింది మెగా కుటుంబం. ఇక ఈ పండగ వాతావరణాన్ని దాదాపు వారం రోజులపాటు… చేసేందుకు మెగా ఫాన్స్ చాలా ఆత్రుత గా ఉన్నారు. ఇక అటు ఈ విషయం తెలియగానే.. మెగా కుటుంబానికి ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన జంటకు… శుభాకాంక్షలు తెలుపుతున్నారు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ప్రముఖ సెలబ్రిటీలు.