Venu Yeldandi: ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉంటుందో ఎవరికీ తెలీదు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ లో కనుక్కోవడం చాలా కష్టం. ఆ విధంగా ఓ నటుడు దర్శకుడు అవ్వడం మాత్రమే కాదు సూపర్ హిట్ కూడా కొట్టి అందరిని ఆశ్చర్య పరిచాడు. ‘వేణు యేల్దండి’.. ఈ పేరు నాలుగు నెలల క్రితం వరకు చాలా మందికి తెలియదు. అందరూ అతన్ని “జబర్దస్త్ వేణు” అని పిలిచేవారు. కమెడియన్‌గా ప్రేక్షకులకు గుర్తింపు తెచ్చుకున్నాడు. తెర ముందు కామెడీతో నవ్వించడమే కాకుండా, తెర వెనుక దర్శకుడిగా ఎమోషన్‌తో కన్నీళ్లు పెట్టుకోవడం తనకు తెలుసని నిరూపించేందుకు బలగం సినిమాని ఉపయోగించుకున్నాడు.
దర్శకుడిగా వేణు తొలి సినిమాతోనే మంచి విజయం సాధించాడు. అది ఆషామాషీ విజయం కాదు. ఇండస్ట్రీ చెప్పుకోదగ్గ విజయం. అలాంటి విజయం అందుకున్న వేనుని పొగడని నోరు లేదు. అందుకే టైం తీసుకొని మరీ ఇప్పుడు మరో ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన రెండో సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో వేణు తాజాగా ఒక అప్ డేట్ ఇచ్చాడు. తాను వర్క్ చేయబోయే రెండో సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించినట్లు సోషల్ మీడియాలో ప్రకటించాడు. దీనికి సంబంధించి ఫోటో ను సోషల్ మీడియా లో అందరితో పంచుకున్నారు.
మొదటి సినిమాలో ఏవిధంగా అయితే ఎమోషన్స్ కి ప్రాధాన్యం ఇచ్చాడో రెండో సినిమాకు కూడా ఎమోషనల్ సీన్స్‌పై వేణు చాలా శ్రద్ధ పెట్టినట్లు సమాచారం. ఇక ఈ అప్డేట్ పై నెటిజన్లు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘బలగం’ తరహాలో ఈ సినిమా కూడా హిట్ అవుతుందని ఆశిస్తున్నామని వ్యాఖ్యానించారు. మీకు ఇంకో హిట్ రావాలా.. గుడ్ లక్ సార్…, మంచి యాక్షన్ థ్రిల్లర్ స్టోరీ రాసుకోండి అన అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. వేణు ఎలాంటి సినిమా చేస్తాడు? హీరో, హీరోయిన్లు ఎవరు? అనే విషయాలు ఇంకా తెలియరాలేదు.
తెలంగాణ పల్లెను కళ్లకు కట్టినట్లు చూపించాడు వేణు. మాటలతో, పాటలతో, భావోద్వేగాలతో సంస్కృతీ సంప్రదాయాలను కళ్ళకు కట్టినట్లు సృష్టించాడు. మార్చి 3న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఎన్నో అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. గతంలో పల్లెల్లో పరదాలు వేసుకుని సినిమాలు చూసేవారు. ఇప్పుడు OTT అందుబాటులోకి వచ్చినప్పటికీ, తెలంగాణలోని చాలా గ్రామాల్లో ఆ విధంగా “బలగం” చిత్రాన్ని ప్రదర్శించడం గమనించదగ్గ విషయం.(venu yeldandi)
Started…..#2✌?#Cinema #writing pic.twitter.com/PTpl7lmKDh
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) June 19, 2023