Was Rashmika Mandanna cheated by her former manager
Rashmika Mandanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్, కర్ణాటక బ్యూటీ రష్మిక మందాన..కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కర్ణాటక నుంచి వచ్చి తెలుగులో సెటిల్ అయిన ఈ బ్యూటీ… ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్గా ఎదిగిపోయింది. చలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందాన… ఆ తర్వాత వరుసహిట్లతో అగ్ర హీరోయిన్గా ఎదిగిపోయింది.
గీతా గోవిందం, సీతారామ o, పుష్ప, డియర్ కామ్రేడ్, వారసుడు, సరిలేరు నీకెవ్వరు లాంటి బంపర్ హిట్ లను అందుకొని… ఇప్పుడు స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది రష్మిక మందాన. అందం మరియు అభినయంతో…. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది ఈ బ్యూటీ రష్మిక మందాన. వరుస సినిమాలతో పాటు… భారీ గా రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటుంది ఈ బ్యూటీ. అయితే తాజాగా రష్మిక మందాన ( Rashmika Mandanna ) గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

కర్ణాటక కు చెందిన రష్మిక మందానను… తన పర్సనల్ మేనేజర్ దారుణంగా మోసం చేశాడని ఈ వార్తల సారాంశం. చలో సినిమా నుంచి… రష్మిక దగ్గర పర్సనల్ మేనేజర్ గా ఓ వ్యక్తి పనిచేస్తున్నాడట. అప్పటినుంచి ఇప్పటివరకు నమ్మిన బంటుగా ఆ మేనేజర్ కొనసాగినట్లు సమాచారం. రష్మిక తన పర్సనల్ విషయాలు అలాగే, ఫ్యామిలీ విషయాలను కూడా… మేనేజర్ తో పంచుకునేదట. అలాంటి మేనేజర్ నమ్మిన బంటుగా ఉండి… ఏకంగా 80 లక్షలు… హీరోయిన్ రష్మిక కు టోపీ పెట్టాడు.
ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న రష్మిక… అతని ఉద్యోగంలోంచి కూడా తీసేసిందని సమాచారం. మళ్లీ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎక్కడ పని చేయకుండా… రష్మిక ఈ వివాదాన్ని డీల్ చేసిందట. అయితే ఈ తతంగాన్ని మొత్తం చాలా సీక్రెట్ గా చేసిందట రష్మిక మందాన. అయితే ఆమె దగ్గర పని చేస్తున్న వ్యక్తుల ద్వారా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ విషయం. ఈ సంఘటన గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.