Why dont eat Brahmins onion and garlic
Brahmin’s : ఉల్లిపాయ లేనిదే ఏ కూర ఉండరు.ప్రతి ఒక్కరు ఇంట్లో వండుకునే కూరల్లో ఉల్లిపాయని కచ్చితంగా వేసుకుంటారు. అలాగే ఉల్లిపాయ వలన ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఉల్లిపాయలాగా వెల్లుల్లి కూడా ఎన్నో పోషకాలు కలిగివుంది. అయితే అలాంటి పోషక విలువలు ఉన్న ఉల్లిపాయ వెల్లుల్లిని ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో భాగంగా చేసుకుంటారు.కానీ కేవలం బ్రాహ్మన్స్ మాత్రం ఈ ఉల్లిపాయ వెల్లుల్లిని తమ కూరల్లో వండుకోరు.
గతంలో అయితే పుదీనాను కూడా పక్కన పెట్టారు. కానీ కాలం మారుతున్న కొద్ది పుదీనాను తమ కూరల్లో వేసుకోవడం మొదలుపెట్టారు. అయితే బ్రాహ్మిన్స్ (Brahmin’s ) అనగానే మద్య మాంసాలకు దూరంగా ఉంటారు అని తెలుసు. వాళ్లు నిత్యం దేవుడు సేవలోనే నిమగ్నమై ఉంటారు. అయితే అలాంటి బ్రాహ్మిణ్స్ వండుకునే కూరల్లో ఉల్లిగడ్డ, వెల్లుల్లిని ఎందుకు భాగం చేసుకోరో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ వెల్లుల్లి నుండి ఒకరకమైన వాసన వస్తుంది. అందులో సల్ఫర్ ఎక్కువగా ఉండటం వల్ల ఆ వాసన వస్తుంది. అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి తింటే కచ్చితంగా నోటి నుండి వాసన వస్తుంది. అలాగే ఈ ఉల్లిపాయ వెల్లుల్లి తమో,రజో గుణాలను కలిగి ఉంటాయట. అందుకే ఉల్లిపాయ,వెల్లుల్లి ని బ్రాహ్మిన్స్ తమ వంటకాల్లో వాడరు.
అలాగే వీరు ఉల్లిపాయ, వెల్లుల్లిని సాత్విక ఆహారంగా చెప్పుకుంటారు. అందుకే వీరు ఉల్లిపాయ వెల్లుల్లిని దూరం పెడతారు. అంతేకాకుండా బ్రాహ్మిన్స్ ప్రతినిత్యం వేద మంత్రోచ్చారణ చేస్తారు. కాబట్టి వారు ఎల్లప్పుడూ ఆహార నియమాలు పాటిస్తూ ఉంటారు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి ని తీసుకుంటే నోరు వాసన వస్తుంది. కాబట్టి బ్రాహ్మణులు తాము తినే ఆహార పదార్థాలలో ఉల్లిపాయ వెల్లుల్లి వేసుకోరు.