If those birds enter the house will the un married people get married
Birds: చాలామంది ఇళ్లలోకి పక్షులు వస్తే రకరకాల అనుమానాలు పడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్న హిందువులు అయితే ఈ మూఢనమ్మకాలను ఎక్కువగా నమ్ముతుంటారు. అయితే పక్షులు ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుంది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.కాకులు ఇంట్లోకి వస్తే అశుభం జరుగుతుంది అని చాలామంది తెలియని వాళ్ళు భయపడుతూ ఉంటారు.
కానీ కాకి (Crow) ఇంట్లోకి వస్తే చాలా శుభప్రదమట.. మరి ముఖ్యంగా కాకులను పితృదేవతలకు చిహ్నం గా భావిస్తారు. అలాంటి కాకులు ఇంట్లోకి వస్తే తమ పూర్వీకుల ఇంట్లోకి వచ్చారని అర్థం చేసుకోవాలట. అలాగే కాకి మనం పని మీద బయటకు వెళ్తున్నప్పుడు తల మీద తన్నితే అది అస్సలు మంచిది కాదని, కాకి తలపై తన్నినా కూడా మనం బయటికి వెళ్తే మనకు ఏదో కీడు జరుగుతుంది అని అర్థం చేసుకోవాలి.
ఇక మన ఇంట్లోకి వచ్చే మరో పక్షి పిచ్చుక. పిచ్చుక (Sparrow) రాకను ఇంట్లో శుభమని భావిస్తారు. ఎందుకంటే పిచ్చుకలు ఇంట్లోకి వస్తే రుణబాధలు తొలగిపోయి ధనలక్ష్మి వస్తుంది అని నమ్ముతుంటారు..అలాగే జంట పిచ్చుకలు ఇంట్లోకి ప్రవేశిస్తే పెళ్లి కానీ అమ్మాయి అబ్బాయికి త్వరలోనే పెళ్లి జరగబోతుంది అని అర్థం చేసుకోవాలట.
అలాగే సంతాన లేమితో బాధపడుతున్న వారు త్వరలోనే తమకు సంతానం కలుగుతుంది అని నమ్ముతారు.అలాగే పిచ్చుకలు ఇంట్లోకి వచ్చి వెళ్తే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని అర్థం. ఇక గుడ్లగూబ ఇంట్లోకి వస్తే చాలామంది అశుభం అని భావిస్తారు. కానీ గుడ్లగూబ మహాలక్ష్మి వాహనం. అలాంటి గుడ్లగూబ ఇంట్లోకి వస్తే ధనలక్ష్మి రాబోతుందని గ్రహించాలి.