Komatireddy RajagopalReddy likely joins in congress
Komatireddy RajagopalReddy : కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. మొన్నటి వరకు బలంగా ఉన్న బిజెపి పార్టీ… తెలంగాణలో చతికిల పడింది. దీంతో… తెలంగాణ బిజెపిలో చేరిన కొంతమంది నాయకులు…. ఘర్ వాపసి.. అంటూ తిరిగి ఈ కాంగ్రెస్ పార్టీలో అటు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఈ లిస్టులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం అందుతుంది.
గత ఏడాది చివర్లో.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బిజెపి తీర్థం పుచ్చుకున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దీంతో మునుగోడులో బై ఎలక్షన్స్ వచ్చిన సంగతి మనందరికీ వినీతమే. అయితే… మునుగోడు బై ఎలక్షన్స్ ను బాగా వాడుకున్న సీఎం కేసీఆర్… తన పార్టీని మరోసారి అక్కడ గెలిపించుకున్నారు. గులాబి అభ్యర్థి… కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ( Komatireddy RajagopalReddy ) ఏకంగా 11వేల ఓట్ల పైచిలుకు తో ఓటమి పాలయ్యారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి అనంతరం.. తెలంగాణ బిజెపిలో పసలేకుండా పోయింది. అలాగే… యాక్టివ్ గా ఉండే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి… పూర్తిగా పడిపోయాడు. తమ్ముడు నీలా పడడంతో అన్న కోమటీరెడ్డి వెంకట్ రెడ్డి కూడా… కాస్త ఆందోళన చెందుతున్నట్లు సమాచారం అందుతుంది. ఎలాగైనా తన తమ్ముడిని మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలని… కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట.
ఈ మేరకు ఇప్పటికే రాజగోపాల్ రెడ్డితో వెంకటరెడ్డి మాట్లాడినట్లు కూడా సమాచారం అందుతుంది. జూపల్లి మరియు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా.. కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖత చూపిస్తున్నారట. అయితే దీనిపై మరో రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఈ రెండు రోజుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అన్న వెంకట్ రెడ్డి చెప్పినట్లు వింటారా…లేక, బీజేపీలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉంటారా అనేది చూడాలి.