Sree leela has huge offers
Sree leela : చాలా సంవత్సరాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ అంటే…. బొంబాయి, తమిళ్, కర్ణాటక మరియు బాలీవుడ్ హీరోయిన్లు అన్నట్టుగా ఉండేది. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఏ ఒక్క హీరోయిన్ పాపులర్ కాలేకపోయింది. కానీ ఈ మధ్య మాత్రం కొంతమంది భామలు… రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి… టాలీవుడ్ ను ఏలేస్తున్నారు. ఇందులో మొదటి వరుసలో టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల ఉంటుంది. శ్రీ లీల… కర్ణాటక కు చెందిన డ్యూటీ అని చెబుతారు. కానీ ఆమె పుట్టి పెరిగింది మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే. ఈ లెక్కన శ్రీ లీల తెలుగు హీరోయిన్ కిందే వస్తుంది.
అలనాటి హీరో శ్రీకాంత్ కొడుకు హీరోగా చేసిన పెళ్లి సందడి సినిమాతో… తెలుగు చిత్ర పరిశ్రమ కు శ్రీ లీల ( Sree leela ) పరిచయమైందన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా అంతగా ఆడకపోయినా… ఇందులో చేసిన డ్యాన్స్ కారణంగా శ్రీ లీల కు బంపర్ ఆఫర్లు తగిలాయి. మొదటగా రవితేజ హీరోగా చేసిన ధమాకా సినిమాలో ఛాన్స్ కొట్టేసి… తన ఏంటో నిరూపించుకుంది ఈ యంగ్ హీరోయిన్ శ్రీ లీల. ఈ సినిమాలో మాస్ మహారాజు రవితేజ కంటే… ఎక్కువగా డాన్స్ చేసి.. తన వైపు ప్రేక్షకులను తిప్పుకుంది యంగ్ హీరోయిన్ శ్రీ లీల. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో దాదాపు పది సినిమాలకు ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అలాగే తన రెమ్యూనరేషన్ ను కూడా విపరీతంగా పెంచేసింది హీరోయిన్ శ్రీ లీల. ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక్క సినిమాకు ఏకంగా రెండు కోట్లు తీసుకుంటున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. ఇప్పటికే 10 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ బ్యూటీ… రెండు కోట్ల రెమ్యునరేషన్ చొప్పున చూసుకుంటే… వచ్చే ఏడాది ఏకంగా 20 కోట్లు సంపాదిస్తుందన్నమాట. ఇప్పటికే మహేష్ బాబు హీరోగా చేస్తున్న గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఈ బ్యూటీ నటిస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, బాలయ్య చేస్తున్న భగవంతు కేసరి సినిమాలో ఈ బ్యూటీ నటిస్తోంది.
అటు రామ్ మరియు బోయపాటి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ… నితిన్ మరియు వక్కంతం వంశీ కాంబినేషన్లో వస్తున్న ఓ సినిమాలో నటిస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ సినిమా, గోపీచంద్ మలినేని మరియు రవితేజ కాంబోలో వస్తున్న మరో సినిమాలో కూడా నటిస్తోంది. ఇటు ఆది కేశవ సినిమాలో ఇప్పటికే ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమాలో కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుందట ఈ బ్యూటీ. దాదాపు ఈ బ్యూటీ చేతిలో 10 సినిమాలు ఉన్నట్లు సమాచారం.