Ambati Rambabu Comments On Varahi
Ambati Rambabu : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై మరోమారు విరుచుకుపడ్డారు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్ వారాహిని పందితో పోల్చాడు మంత్రి అంబటి రాంబాబు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని ఎదుర్కోవటం మాకు పెద్ద సమస్య కాదని… మోస్ట్ కన్ఫ్యూజ్డ్ పర్సన్ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అంటూ చురకలు అంటించారు. వారాహి ఎక్కి తిరిగి పిచ్చి కూతలు కూస్తే సరిపోతుందా అని నిలదీశారు.
ఇది క్యాస్ట్ వార్ కాదు క్లాస్ వార్…అని… కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులు ఎలా ఓడిపోతారో మేం చూస్తామని వార్నింగ్ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు ( Ambati Rambabu ). పేదలే వచ్చే ఎన్నికల్లో గెలుస్తారని… రామోజీ ఒక వైట్ కాలర్ క్రిమినల్ అని ఆగ్రహించారు. వంగవీటి మరణానికి ముందు టీడీపీ కి ముద్రగడ రాజీనామా చేసారని… అప్పట్లో కాపునాడు జరిగినప్పుడు ముద్రగడ జైల్లో ఉన్నాడని వెల్లడించారు.
టీడీపీ వల్ల వంగవీటి కి ప్రాణహాని ఉందని ఆనాడే చెప్పారని గుర్తు చేశారు అంబటి.

కాపుల గురించి మాట్లాడే హక్కు ముద్రగడకు మాత్రమే వుందని వివరించారు. హరిరామ జోగయ్యకు, పవన్ కు లేదని నిప్పులు చెరిగారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు కోసం కాపులను పవన్ వాడుకోవాలని చూస్తున్నాడని… తన మాటల వాళ్లే రోజు రోజుకి పవన్ గ్రాఫ్ పడిపోతుందని వెల్లడించారు. రాజకీయాల్లో పవన్ ఆత్మహత్య చేసుకుంటున్నాడని… పవన్ సీఎం కాదని చెప్పాక జనం కూడా వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు మంత్రి అంబటి రాంబాబు.
ప్రాణహాని ఉంటే పవన్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలని… రాజకీయాలకు పవన్ పనికిరాడని విమర్శలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ నిలబడిన చోట డిపాజిట్స్ కూడా రావు…లోకేష్ ఎక్కడ నిలబడితే అక్కడ ఓడిపోతాడన్నారు. పవన్ వారాహి మీద కాదు పంది మీద ఎక్కాడని.. చంద్రబాబుతో చేరి పవన్ కూడా 420 లా తయారయ్యాడని చురకలు అంటించారు మంత్రి అంబటి రాంబాబు.