Dimple Hayathi Iteam Song In Indian 2
Dimple Hayathi : టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో… తెలుగు హీరోయిన్ల కంటే ఇతర భాషల హీరోయిన్లు ఎక్కువగా ఉన్నారన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక్కడ తెలుగు హీరోయిన్లను… తొక్కేస్తున్నారని కూడా కొంతకాలంగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ కొంతమంది హీరోయిన్లు.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సెటిల్ అవుతున్నారు.
అలా సెటిల్ అయిన వారిలో హీరోయిన్ డింపుల్ హయాతి ఒకరు. హీరోయిన్ డింపుల్ హయాతి… చాలా అందంగా ఉండటమే కాకుండా… చాలా ఫీట్ గా కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన ఈ బ్యూటీ… ప్రస్తుతం హైదరాబాద్ లోనే సెటిల్ అయిపోయింది. ఈ బ్యూటీ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువగా సినిమాలు చేయకపోయినప్పటికీ… ఐటమ్ సాంగ్స్ లో కనువిందు చేసింది.

గద్దల కొండ గణేష్ సినిమాలో… జరా జరా అనే ఐటెం సాంగ్ లో స్టెప్పులేసి అందరిని కనివిందు చేసింది. ఇక ఇటీవల కిలాడి మరియు రామబాణం సినిమాలలో నటించి అందరిని మెప్పించింది డింపుల్ హయాతి ( Dimple Hayathi ). ఇది ఇలా ఉండగా తాజాగా ఈ బ్యూటీ గురించి ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం సీనియర్ హీరో కమలహాసన్ భారతీయుడు 2 సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ ఉందట.
సినిమాలో ఆ ఐటెం సాంగ్ చేసేందుకు… హీరోయిన్ డింపుల్ హయాతిని సెలెక్ట్ చేసిందట చిత్ర బృందం. ఈ మేరకు ఇప్పటికే అన్ని సంప్రదింపులు కూడా జరిగాయట. అయితే కమల్ హాసన్ ఏజ్ 70 ఏళ్లు దాదాపు ఉంటుంది. అలాంటి సీనియర్ హీరో సరసన ఐటమ్ సాంగ్ చేయడం ఏంటని… కొంతమంది డింపుల్ హయాతిని ట్రోల్ చేస్తున్నారు. కాగా, భారతీయుడు 2 సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీతిసింగ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.