Hair Growth: Does rubbing fingernails really grow hair
Hair Growth: శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని ఎన్నో రహస్యాలు ఈ భూమి మీద ఉన్నాయి. ఇక వాటి గురించి నిత్యం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అయితే పూర్వకాలంలో మన పెద్దలు చెప్పిన కొన్ని పనులు ఇప్పటి వారు మూఢనమ్మకాలు అని అంటారు. కానీ శాస్త్రవేత్తలు మాత్రం వారు చెప్పిందే కరెక్ట్ అని దాని వెనుక సైన్స్ దాగి ఉంది అని చెబుతూ ఉంటారు.
ఇక అలాంటిదే ఒకటి చేతి వేళ్ళు రుద్దితే జుట్టు పెరుగుదల. ఇక ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ చాలామందికి తెలియని సీక్రెట్ ఇది. చేతి వేళ్ళ గోర్లు రుద్దితే జుట్టు ఊడిపోవడం ఆగిపోయి పెరుగుదల ఉంటుంది అని మన పూర్వీకులు చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక యోగ. అయితే యోగ చేయడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కానీ బిజీ లైఫ్ లో భాగంగా చాలామంది యోగ చేయడం లేదు.
అయితే కూర్చున్న దగ్గరే చేసే యోగా వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. చేతి వేళ్లను సమయం దొరికినప్పుడల్లా రుద్దుకోవడం వల్ల జుట్టు ఊడిపోయే సమస్య తగ్గిపోతుందట. ఇలా చేతివేళ్లు ప్రతిసారి రుద్దుకున్నప్పుడు మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుందట. అంతే కాకుండా నిద్రలేమి, బట్టతల, జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలకు కూడా చేతి వేళ్లను రుద్దుకోవడం అనే యోగ ప్రక్రియ ద్వారా ఈ సమస్యలన్నింటినీ దూరం చేసుకోవచ్చు.
మరీ ముఖ్యంగా ఇలా రుద్దుకోవడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తరచూ ఇలా చేతికి వేళ్ళను రుద్దుకోవడం వల్ల మన శరీరంలో డిహైడ్రో టెస్టోస్టిరన్ హార్మోన్ నియంత్రించ బడి ఫలితంగా జుట్టు పెరుగుదల కనిపిస్తుంది. అందుకే వీలైనప్పుడల్లా చేతివేళ్ల గోర్లను రుద్దుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.