Lavanya Tripati rejects vijay movie
Lavanya Tripati : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి మరియు మెగా హీరో వరుణ్ తేజ్ జంట కొన్ని రోజుల కిందటే అంటే జూన్ 9వ తేదీన ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి మనందరికీ విధితమే. అప్పుడప్పుడు అంతరిక్షం సినిమా సమయంలో… లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్ ప్రేమలో పడ్డారట. దాదాపు 7 నుంచి 8 సంవత్సరాల పాటు ఈ జంట ప్రేమించుకుందట. 8 సంవత్సరాలలో మీడియా కంట పడకుండా చాలా జాగ్రత్తగా… రిలేషన్షిప్ మైంటైన్ చేసింది లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్ జంట.
ఇక అసలు విషయాన్ని నాగబాబుతో చెప్పడంతో… జూన్ 9వ తేదీన వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. ఇక నవంబర్ లేదా డిసెంబర్ మాసంలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కడినుంది. ఇలాంటి తరుణంలో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి మధ్య గొడవలు జరిగినట్లు… ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ మరియు దర్శకుడు పరశురాం కాంబినేషన్లలో గీతగోవిందం సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కించగా… విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందాన నటించింది. అయితే మొదటగా… ఈ సినిమాలో లావణ్య త్రిపాఠినీ చిత్ర బృందం అనుకుందట. ఈ మేరకు అప్పటికే లావణ్య త్రిపాటికి సినిమా కథ మొత్తం చెప్పారట. ఇందులో ఒక లిప్ లాక్ కూడా దర్శకుడు లావణ్య త్రిపాఠికి వివరించాడట.
సినిమా కథ నచ్చడంతో లావణ్య త్రిపాఠి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అయితే ఈ విషయం వరుణ్ తేజ్ కు చెప్పడంతో… ఆ సమయంలోనే… వరుణ్ తేజ్ రిజెక్ట్ చేశాడట. అలాంటి సినిమాలు వద్దని లావణ్య త్రిపాఠి తో గొడవపడ్డాడట వరుణ్ తేజ్. దీంతో చేసేది ఏమీ లేక… ఆ సినిమాను వదులుకుందట లావణ్య త్రిపాటి. ఇప్పుడు ఆ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి… వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని… దానికి విజయ్ దేవరకొండ కారణమని కొంతమంది పోస్టులు పెడుతున్నారు.