Rana wife Miheeka Bajaj photos are viral
Miheeka Bajaj: ఇండస్ట్రీలో హీరోయిన్లకు గ్లామర్ షో తప్పదు. కానీ నేటి ఆధునిక ప్రపంచంలో సెలబ్రిటీలు, స్టార్ హీరోల భార్యలు కూడా గ్లామర్ షో చేసేందుకు వెనుకాడడం లేదు. సోషల్ మీడియా వచ్చిన దగ్గర్నుండి బుల్లితెర భామల నుండి హీరోయిన్లు, హీరోల భార్యలు ఇలా ఎవరికి నచ్చినట్లు వారి గ్లామర్ చూపించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా వీరు చూపించే అందాలు కుర్ర కారుని హీట్ ఎక్కిస్తున్నాయి.
ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ తన గ్లామర్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా.. తాజాగా ఇప్పుడు మరో హీరో దగ్గుబాటి రానా భార్య మిహికా బజాజ్ తన గ్లామర్ షో తో కళ్ళు చెదిరేలా చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. దగ్గుబాటి రానా 2020 లాక్ డౌన్ సమయంలో మిహికా బజాజ్ ని ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈమె ఒక ప్రముఖ ఈవెంట్ మేనేజర్. వెంకటేష్ కూతురు ఆశ్రిత ద్వారా మిహికా రానాకి పరిచయమైంది.
ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి పెళ్లికి దారి తీసింది. ఇక పెళ్లి తర్వాత ఫ్యామిలీ ఫోటోలు, భర్తతో దిగిన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసే మిహికా.. తాజాగా తన హాట్ ఫోటోను షేర్ చేసి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని టాలెంట్ మిహికా సొంతం. కొద్ది రోజుల క్రితం లండన్ ట్రిప్ కి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేసిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది మిహికా.
హాఫ్ షోల్డర్ టాప్ మినిట్స్ కట్టు లాంటి దుస్తులలో మెరిసిపోతూ నీలిరంగు దుస్తులలో స్టైలిష్ గా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్లు చాలా హాట్ గా ఉన్నారు అంటూ.. సినిమాలలోకి ఎంట్రీ ఎప్పుడు ఇస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొంతమంది మాత్రం ఇంత షో చేయాల్సిన అవసరం ఏముందని అంటున్నారు.