Beauty Tips: Are you going to be a bride in next month
Beauty Tips: ఈ మధ్యనే పెళ్లిళ్ల సీజన్ ముగిసింది. ప్రస్తుతం ఆషాడం సీజన్ నడుస్తోంది. ఆషాడం అయిపోయాక శ్రావణం వస్తుంది. శ్రావణంలో కూడా చాలానే పెళ్లిళ్లు జరుగుతూ ఉంటాయి.అయితే పెళ్లిళ్లలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేది పెళ్ళికొడుకు పెళ్ళికూతురు. మరీ ముఖ్యంగా పెళ్లికూతురు అందంగా ఉందా లేదా అని పెళ్లికి వచ్చిన చాలామంది ఆరా తీస్తూ ఉంటారు.
అయితే అలాంటి టైం లో పెళ్లికూతురు (Bride) అందంగా మెరిసిపోవడానికి పెళ్లికి కొన్ని రోజుల ముందు నుండే ఇలాంటి ఇంటి చిట్కాలు గనుక పాటిస్తే పెళ్లిలో చాలా అందంగా మెరిసిపోతూ ఉంటారు. మరి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఒకసారి మీ ఇంటి దగ్గర ఈ చిట్కాను పాటించండి.మరి ఆ చిట్కా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది అమ్మాయిలు మొండిమచ్చలు,ఆయిల్ స్కిన్ వంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటారు.
అయితే వాటిని పోగొట్టుకోవడానికి ఒక టమాటాను తీసుకొని ముక్కలుగా కట్ చేసి అలాగే ఓ నిమ్మకాయని కూడా ముక్కలుగా కట్ చేసి మిక్సీలో ఈ రెండింటినీ వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ బియ్యం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి..ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ని వేరు చేయాలి.ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ జ్యూస్ లో పావు టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ పెరుగు,రెండు టేబుల్ స్పూన్ ల చందనం బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని మీ మొహానికి అలాగే మెడకి కాస్త ఒత్తుగా పట్టించాలి.
ఆ తర్వాత 20 నిమిషాలు ఆరనిచ్చి తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే అందమైన నిఘారింపు గల మొహం మీ సొంతం. అయితే పెళ్లికి ముందు ఇలా తరచూ చేస్తే కొద్దిరోజుల్లోనే మీ మొహం పై ఉండే నల్లని మచ్చలు పెరిగిపోతాయి.అంతేకాకుండా పెళ్లి టైం లో మీ మొహం చాలా నిగారింపుగా కనిపిస్తుంది.