Rituals:Why does a person who shaves his head when he dies shave it on peddakarma
Rituals : సాధారణంగా హిందువుల్లో పండగలు,శుభకార్యాల వేళలో అలాగే అశుభ కార్యాల సమయంలో కూడా ఎన్నో రకాల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు పాటిస్తూ ఉంటారు. అయితే ఈ ఆచార సాంప్రదాయాలు అనేవి పూర్వకాలం నుండి పాటిస్తూ వస్తున్నారు. అందులో ఒకటే చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు గుండు గీయించుకోవడం.
అయితే మన హిందూ సాంప్రదాయం ప్రకారం తలకొరివి పెట్టిన అలాగే తండ్రి చనిపోతే తండ్రికి సంబంధించిన కొడుకులు,ఒకవేళ తల్లి చనిపోతే తల్లికి సంబంధించిన కొడుకులు లేకపోతే తలకొరివి పెట్టిన వ్యక్తి మనవడు వంటి వాళ్లు పెద్దకర్మ రోజు కచ్చితంగా గుండు గీయించుకుంటారు. అయితే ఇలా గుడ్డు గీయించుకోవడం వెనుక అనేక కారణాలు చెబుతారు. ‘
అందులో ఒకటే చనిపోయినప్పుడు ఆ వ్యక్తికి తలకొరివి పెట్టిన వ్యక్తి 11వ రోజు గుండు గీయించుకుంటారు. ఇక ఇలా గుండు గీయించుకోవడం వెనుక చనిపోయిన వ్యక్తిపై ప్రేమ, గౌరవంతో గుండు గీయించుకుంటారు అని కొంతమంది చెబుతూ ఉంటారు. ఇక మరికొంతమందేమో చనిపోయిన తర్వాత కూడా ఆత్మ కుటుంబ సభ్యుల చుట్టూనే తిరుగుతూ ఉంటుందట.
అయితే ఆ ఆత్మకి దేహం లేనందువల్ల వెంట్రుకలతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తుందట.అందుకే తలకొరివి పెట్టిన వ్యక్తి పదకొండవ రోజు గుండు గీయించుకోవాలి అని పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం.ఇలా గుండు గీయించుకోవడం వల్ల చనిపోయిన వ్యక్తి ఆత్మ శాంతించి ఆ కుటుంబ సభ్యుల నుండి ఆ ఆత్మ స్వర్గానికి లేదా నరకానికి వెళ్తుందట. అందుకే గుండు గీయించుకుంటారట.