Chanakya Niti :After doing these three things even by mistake
Chanakya Niti: చాణిక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా భవిష్యత్తులో జరగబోయే ఎన్నో రకాల పరిణామాలను ముందే ఊహించి తన నీతి శాస్త్రంలో రాశారు..ఆయన రాసిన గ్రంథాలు ఇప్పటికీ నేటి యువతకు అనుగుణంగానే ఉంటాయి. అలాంటి చాణిక్యుడు తన నీతి శాస్త్రంలో ఈ మూడు పనులు చేశాక కచ్చితంగా స్నానం చేసి ఇంట్లోకి రావాలి అని చెప్పాడు.
మరి ఎలాంటి పనులు చేశాక స్నానం చేయకుండా ఇంటికి రాకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఎప్పుడు కానీ జుట్టు కత్తిరించుకోవడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్నానం చేసే ఇంట్లోకి రావాలి.అలా చేయకుండా ఇంట్లోకి వస్తే కట్ చేసిన వెంట్రుకలు చిన్న చిన్నవి మన శరీరంపై అలాగే ఉంటాయి. అలాగే ఆ వెంట్రుకలు ఉండడం వల్ల అనారోగ్యం తలెత్తే అవకాశం ఉంటుంది.
అందుకే ఎప్పుడు కూడా జుట్టు కట్ చేసుకున్నాక కచ్చితంగా తల స్నానం చేసి ఇంట్లోకి రావాలి. అలాగే అంత్యక్రియలకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు ఇంట్లోకి వచ్చేటప్పుడు తల స్నానం చేసే రావాలి. ఇలా స్నానం చేయకుండా ఇంట్లోకి వస్తే చనిపోయిన వ్యక్తి నుండి వచ్చే బ్యాక్టీరియా మనపై ఉంటుంది.అందుకే ఆ బ్యాక్టీరియా స్నానం చేయకుండా ఇంట్లోకి వస్తే ఇంట్లో కూడా ప్రవేశిస్తుంది.
అందుకనే అంత్యక్రియలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్నానం చేసే ఇంటికి రావాలి. అలాగే జుట్టుకు నూనె పెట్టుకున్నాక కూడా కచ్చితంగా స్నానం చేయాలి.ఎందుకంటే నూనె పెట్టుకున్నాక ఒంట్లో నుండి కొన్ని వ్యర్థాలు బయటికి వస్తాయి. అందుకే స్నానం చేసే ఇంట్లోకి రావాలి. ఇక ఈ మూడు పనులు చేసిన తర్వాత పొరపాటున కూడా స్నానం చేయకుండా ఉండకూడదు.