Did Bhumika lead love affairs with so many heroes?
Bhumika: యువకుడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ భూమిక చావ్లా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు తెలుగులో ఈమె పేరు సంచలనం. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది ఈ బ్యూటీ. తన తొలి చూపులతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈమె మొదటి సినిమా అంతగా హిట్ కాకపోయినప్పటికీ.. ఆ తరువాత తన టాలెంట్ తో స్టార్ హీరోల పక్కన నటించే అవకాశం దక్కించుకుంది.
తెలుగు కంటే ముందే హిందీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది భూమిక. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన తేరే నామ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తరువాత బాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సౌత్ లో అడుగు పెట్టింది. ఆ సమయంలో నాగార్జున ప్రొడ్యూసర్ గా చేస్తున్న యువకుడు సినిమాలో సుమంత్ పక్కన నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత సుమంత్ – నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన స్నేహమంటే ఇదేరా సినిమాలో భూమికని హీరోయిన్ గా తీసుకున్నారు.
అయితే స్నేహమంటే ఇదేరా సినిమాలో నటిస్తున్న సమయంలోనే నాగర్జున – భూమిక మధ్య ఏదో ఉండని రూమర్లు గట్టిగా వినిపించాయి. కానీ వీరిద్దరూ ఆ తర్వాత ఎక్కడ బయట కనిపించకపోవడంతో కొద్దిరోజులకు ఈ రూమర్స్ ఆగిపోయాయి. ఆ తర్వాత కొద్ది రోజులకు భూమిక బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న సమయంలో సల్మాన్ ఖాన్ తో ప్రేమాయణం నడుపుతోందని ఇండస్ట్రీ మొత్తం రూమర్స్ వైరల్ అయ్యాయి. కాస్త సన్నిహితంగా ఉంటే ఇండస్ట్రీలో ఇటువంటి ఎన్నో రూమర్స్ పుట్టుకస్తాయనే విషయం తెలిసిందే.
ఇలా భూమిక పేరు అప్పట్లో వైరల్ గా మారింది. ఇక తర్వాత 2007లో భరత్ ఠాకూర్ ని పెళ్లి చేసుకుంది భూమిక. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆయన మరెవరో కాదు భూమిక టీచర్. ఆయన దగ్గరే యోగా నేర్చుకున్న భూమిక.. వీరి మధ్య పరిచయం ప్రేమగా మరి నాలుగేళ్లపాటు డేటింగ్ చేసిన తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక వీరికి 2014లో యష్ అనే బాబు పుట్టాడు. మధ్యలో కొన్నిసార్లు భూమిక భర్తతో విడిపోయిందనే ప్రచారం జరిగినప్పటికీ అలాంటిదేం లేదని ప్రతిసారి చెప్పుకొస్తుంది భూమిక.