Is this the real secret bahind making Bonalu festival in ashadam
Bonalu: ఆషాడ మాసం అనగానే తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండుగ ప్రారంభం అవుతుంది. తెలంగాణలో ఆషాడంలో బోనాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది.ఇక్కడ బోనాల పండుగ ప్రారంభం అయ్యేది గోల్కొండ జగదాంబికా అమ్మవారి ఆలయం నుండి. ఆ తర్వాత సికింద్రాబాద్, బల్కంపేట ఇలా నగరంలోని ప్రతి ఒక్క చోట ఉన్న అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తారు.
ఇక ఈ బోనం తయారు చేయడానికి కొత్త కుండ తీసుకువచ్చి అందులో బియ్యం, పసుపు వేసి బోనం వండి, బోనం చుట్టూ పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి దాని చుట్టూ వేపాకుల దండలు కడతారు. ఆ తర్వాత ఇంటి దగ్గర నుంచి అమ్మవారి గుడి వరకు డబ్బు చప్పులతో ఊరేగింపుగా వెళ్తారు. అయితే ముందుగా అమ్మవారిని అత్తవారింటి నుండి పుట్టింటికి తీసుకు వెళ్లే కార్యక్రమాన్ని ఘటోత్సవం అంటారు.
దీన్ని చాలా వైభవంగా చేస్తారు. అలాగే బోనాల లో స్పెషల్ అట్రాక్షన్ గా పూనకాలు వచ్చిన శివసత్తులు, పోతరాజుల వేషం వేసిన వాళ్ళు,పులి వేషం వేసిన వాళ్ళు నిలుస్తారు. అలాగే ఈ బోనాలు ఆచరణలో సమర్పించడానికి ప్రధాన కారణం ఆషాడంలో వానలు స్టార్ట్ అవుతాయి.
వానలతో పాటు అనేక రోగాలు కూడా వస్తాయి. ఇక ఈ రోగాలు అన్నింటి నుండి కాపాడమని వేడుకోవడానికి ఈ బోనాల పండుగను అమ్మవారికి పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. అందుకే ఆషాడమాసంలో ఊర్లో ఉండే ప్రతి ఒక్క అమ్మ వారికి ప్రజలు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పిస్తూ ఉంటారు.