It is very good to grow parrot at home but if you make that one mistake
Parrot: ప్రతి ఒక్కరు ఇంట్లో పెంపుడు జంతువులుగా కుక్కలను, పిల్లులను పెంచుకుంటూ ఉంటారు. ఇక ఇంకొంత మంది అయితే ప్రేమతో పావురాలను, రామచిలకల్ని కూడా పెంచుకుంటారు. అయితే వీటిని పెంచుకున్న కూడా వాటిని హింసించకుండా వాటికి స్వేచ్ఛ నిస్తూ తిరిగేలా చేయడం చాలా మంచిది. అయితే రామచిలకల్ని ఇంట్లో పెంచడం మంచిది కాదు అని,అలా పెంచడం వల్ల ఇంటికి అశుభం అని కొంతమంది అంటూ ఉంటారు.
మరి నిజంగానే రామచిలకలు (Parrot) ఇంట్లో పెంచితే అశుభమా..అనేది చాలామంది మదిలో మెదిలే ప్రశ్న.అయితే రామచిలకల్ని ఇంట్లో పెంచడం వల్ల ఎలాంటి అశుభం జరగదట. ఇంటికి చాలా మంచిదట. అంతేకాకుండా ఇంట్లో రామచిలుకలు తిరుగుతూ ఉంటే ఇంటికి అందం రావడమే కాకుండా జీవిత భాగస్వాముల మధ్య ఉన్న మనస్పర్ధలు కూడా తొలగి పోతాయట.
అలాగే పిల్లల్లో కూడా జ్ఞాపకశక్తి పెరిగి చదువులో ముందంజలో ఉంటారట. అలాగే ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యల నుండి రామచిలకల వల్ల ఉపశమనం కలుగుతుందని ఇవి ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ మన ఇంటి చుట్టే తిరుగుతుంది అని కొంతమంది ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.
కానీ ఈ విషయాలు తెలియని కొంతమంది అయితే ఇంట్లో రామచిలుకలు ఉంటే మంచి జరగదు అని చెబుతూ ఉంటారు. కానీ రామచిలకలు ఉండడం ఇంటికి చాలా మంచిది. అయితే రామచిలకలు ఉన్నప్పుడు పొరపాటున కూడా వాటిని పంజరంలో బంధించి హింసించ కూడదట. దానికి స్వేచ్ఛనిచ్చి బయట విడిచి పెడితేనే మంచిదట.