Samantha fell in love again..?
Samantha: ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రేక్షకులను మాయ చేసిన స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంచుమించు స్టార్ హీరోలు అందరి సరసన నటించిన సమంత ఇప్పుడు బాలీవుడ్, హాలీవుడ్ లెవెల్ లో పరుగులు పెడుతుంది. సౌత్ లో దీర్ఘకాలం నుండి స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న హీరోయిన్లలో సమంత ఒకరు.
ఈ ముద్దుగుమ్మ నాగచైతన్య తో ప్రేమ, పెళ్లి, విడాకుల వ్యవహారం అందరికీ తెలిసిందే. ఇక అప్పటినుండి ఈమె ఏం చేసినా..? ఎక్కడికి వెళ్లినా..? సోషల్ మీడియాలో ఏ పోస్ట్ చేసినా..? క్షణాలలో వైరల్ అవుతున్నాయి. ఇక సమంత సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను ధైర్యంగా పంచుకోవడంలో ముందుంటుంది. విడాకుల తరువాత సమంత సినిమాలలో బిజీగా ఉంటూ తన కెరీర్ పై ధ్యాస పెట్టింది. విడాకులు తీసుకున్న తర్వాత కూడా కొన్ని సినిమాలు బాగానే హిట్ కొట్టాయి.
ఈమధ్య వచ్చిన శాకుంతలం సినిమా డిజాస్టర్ కావడంతో సమంత చాప్టర్ అయిపోయిందనే వార్తలు వైరల్ అయ్యాయి. కానీ సమంత మాత్రం ఫెయిల్యూర్ ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ సక్సెస్ వైపు పరుగులు తీస్తోంది. అయితే ప్రస్తుతం సమంత గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ మరోసారి వైరల్ గా మారింది. ఈ ముద్దుగుమ్మ ఓ యంగ్ హీరోతో ప్రేమలో ఉందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇందుకు కారణం.. తన బెస్ట్ ఫ్రెండ్, యాక్టర్ కం డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఫోటో షేర్ చేసిన సమంత.. అతని మంచితనాన్ని వివరిస్తూ, తనని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని ఓ పోస్ట్ చేయడంతో సమంత మళ్ళీ ప్రేమలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. రాహుల్ రవీంద్రన్ ఫోటో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది సమంత. “మీకు తెలిసిన మంచి వ్యక్తిని తీసుకొని వందసార్లు మల్టీప్లై చేస్తే అది నా బెస్ట్ ఫ్రెండ్. రాహుల్ నిన్ను జీవితాంతం ప్రేమిస్తూ ఉంటాను” అంటూ పోస్ట్ చేసింది. దీంతో సమంత మళ్ళీ ప్రేమలో పడిందంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై సమంత ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.