Kala Bhairava: Do you know if we worship this god change our life
Kala Bhairava: ప్రతి ఒక్కరూ దేవున్ని వేడుకునేది తమ కష్టాల నుండి బయట పడేయమని, అలాగే తమకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడమని,అవసరానికి కావాల్సిన డబ్బులు ఇవ్వమని. అయితే కొంతమంది ఎన్ని దేవుళ్లకు పూజలు చేసినా కూడా వారు అనుకున్న కోరికలు నెరవేరవు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే దేవుడు మన తలరాతనే మార్చేస్తాడు అంటే ఎవరైనా ఆ దేవున్ని పూజించకుండా ఎందుకు ఉంటారు.మరి ఆ దేవుడు ఎవరు.. అసలు విషయం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరూ తమ కష్టాల కడలి నుండి బయట పడడానికి దేవుళ్లను పూజిస్తారు. మరీ ముఖ్యంగా ఈ కష్టాలను బయటికి పడేసే వారిలో కాలభైరవుడి (Kala Bhairava) ని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది అని అంటుంటారు. శునకాన్ని కాలభైరవుడిగా అంటూ ఉంటారు. శునకం పై కాలభైరవుడు నాలుగు భుజాలతో కూర్చొని ఉంటాడు. ఇక ఈ కాలభైరవుడిని శనివారం రోజు పూజిస్తే ఫలితం ఉంటుంది.
శనివారం ఉదయాన్నే లేచి అన్ని పనులు ముగించుకొని ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో కాలభైరవున్ని ఆరాధించడం మంచిది.అయితే కాలభైరవుడికి దీపారాధన చేసేటప్పుడు బూడిద గుమ్మడికాయని సగానికి కట్ చేసి అందులో ఉండే కొంత భాగం తీసివేసి ఆ గుమ్మడికాయలో నువ్వుల నూనె పోసి అలాగే తోక మిరియాలను వేసి,ఎర్రని గుడ్డతో వత్తిని చేసి అందులో వేసి,అలాగే బూడిద గుమ్మడికాయపై రాళ్ల ఉప్పు వేయాలి.
ఇలా చేసి ఆ స్వామివారికి దీపారాధన చేయడం వల్ల మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాగే కాలభైరవుడికి ఇష్టమైన బెల్లం, కొబ్బరి,చక్కెర, పాలు, అటుకులు వంటి వాటిని నైవేద్యంగా పెడితే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని, కష్టాల కడలి లో నుండి కాలభైరవుడు మనల్ని బయటపడేస్తాడు అని పెద్దల నమ్మకం.