Roja counter to pawan and chandrababu
Roja : ఏపీ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వర్సెస్ వైసీపీ సర్కార్ అన్నట్లు…. పాలిటిక్స్ ఏపీలో హీటెక్కాయి. ఇక ఈ తరుణంలోనే.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి రోజా సెల్వమణీ. తిరుపతిలో తాజాగా మీడియాతో మంత్రి రోజా మాట్లాడుతూ… హాయ్ ఏపీ… బై బై బిపి ( బాబు, పవన్ కళ్యాణ్) అనే నినాదాన్ని వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందుకుంటారని చురకలు అంటించారు.
ఎన్నికల గుర్తు లేదు, జిల్లా అధ్యక్షులు లేరు, 175 స్థానాల్లో అభ్యర్థులు లేరంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ఆడేసుకున్నారు రోజా. అయినా జగన్ ను తరిమేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడం విడ్డూరంగా ఉందంటూ చురకలు అంటించారు. ఇక చంద్రబాబు నాయుడును నమ్మే పరిస్థితిల్లో ఏపీ ప్రజలు లేరని చురకలు అంటించారు రోజా ( Roja ). వీరు స్లోగన్ దగ్గర నుంచి మేనిఫెస్టో వరకు అంతా కాపీ కొడుతున్నారని ఆగ్రహించారు.

బుర్ర పెట్టి కొత్తగా ఆలోచించే సత్తా కూడా వీరికి లేదని ఫైర్ అయ్యారు మంత్రి రోజా. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తన మేనిఫెస్టోని పక్కన పెట్టేశాడు… చెప్పిన ప్రతి మాటను నెరవేర్చిన వ్యక్తి సీఎం జగన్ అంటూ కొనియాడారు రోజా. ఇప్పుడిప్పుడే ఏపీ ప్రజలు బాగున్నారని చెప్పారు. పవన్ ఏక్కడి నుండి పోటీ చేస్తాడో చెప్పాలని…ఎమ్మెల్యే కాకుండా ముఖ్యమంత్రి ఎలా అని నిలదీశాడు.
పవన్ ఏన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తాడో ముందుగా చెప్పాలని… సిఎం కావాలంటే 88 ఏమ్మేల్యేలు గెలవాలని గుర్తు చేశారు రోజా. అన్ని నియోజకవర్గాలలో పోటీ చేయనేపుడు సిఎం ఎలా అవుతాడని నిలదీశారు రోజా. కార్యకర్తలను ఉత్సాహ పరచడానికే సిఎం అవుతానన్నాని ఆయనే చెపుతున్నాడని… పవన్ వ్యాఖ్యల వెనుక సిరియస్ నెస్ లేదంటూ విమర్శలు చేశారు ఏపీ మంత్రి రోజా.