Keerthi Suresh entry into politics?
Keerthi Suresh: మలయాళ గీతాంజలి సినిమాతో సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి.. నేను శైలజ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై.. మహానటి సినిమాతో దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఓవైపు గ్లామర్ పాత్రలు చేస్తూనే.. మరోవైపు కథాయికగా ప్రాధాన్యం ఉన్న కథలలోనూ ప్రయాణం చేస్తుంది.
ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా మూవీగా వచ్చిన దసరా సినిమాతో కీర్తి సురేష్ మంచి హిట్ అందుకుంది. ఇక ప్రస్తుతం ఉదయనిది స్టాలిన్ హీరోగా నటిస్తున్న “మామన్నన్” అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో భారీ తారాగణం ఉంది. మలయాళ నటుడు పహద్ ఫజిల్, ఉదయనిది స్టాలిన్, వడివేలు ఈ సినిమాలో కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ చూస్తే పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ గా కనిపిస్తోంది. జూన్ 29న ఈ సినిమా విడుదల కానుంది.
ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ కి రాజకీయాలలోకి వచ్చే ఆలోచన ఉందా..? అనే ప్రశ్న ఎదురైంది. దీంతో ఆ విషయం గురించి ఆలోచించాలని చెప్పింది కీర్తి. అయితే కీర్తి అలా అనడంతో రాబోయే రోజులలో రాజకీయ ప్రవేశం చేస్తారని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది.
మంత్రి ఉదయనిది స్టాలిన్ తో కీర్తి సురేష్ కి మంచి స్నేహబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే రాబోయే రోజులలో కీర్తి పొలిటికల్ ఎంట్రీ ఉండవచ్చని తెలుస్తోంది. గతంలో కూడా కీర్తి బిజెపిలో చేరుతుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. కానీ ఆమె తల్లి ఆ వార్తలను ఖండించింది. ఇప్పుడు కీర్తి చేసిన వ్యాఖ్యలతో మరోసారి ఆమె పొలిటికల్ ఎంట్రీ వార్తలు వైరల్ గా మారాయి.