venu swamy poja in Dimple Hayathi home
Dimple Hayathi : తెలుగు రాష్ట్రాలలో.. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ వేణు స్వామి గురించి తెలియని వారు ఉండరు. ఎప్పుడూ యూట్యూబ్ ఛానల్ లో.. టాలీవుడ్ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ… నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. లావుగా పంచ కట్టు కట్టుకొని… చాలా సాంప్రదాయ పద్ధతిలో కనిపించే వేణు స్వామి… ఇప్పటివరకు చెప్పినవన్నీ దాదాపు జరిగాయి. అక్కినేని నాగచైతన్య మరియు సమంత జంట నుంచి.. హీరోయిన్ నయనతార వివాహం వరకు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పిన విషయాలు చాలా వరకు నిజాలు అయ్యాయి.
అక్కినేని నాగచైతన్య మరియు సమంత విడాకులు తీసుకుంటారని ఆయన చెప్పిన ఏడాది తర్వాతనే.. వారిద్దరూ కారణాలు చెప్పకుండానే విడాకులు తీసేసుకున్నారు. ప్రస్తుతం ఎవరి బతుకు వారిదే అన్నట్లుగా జీవిస్తున్నారు. ఇక నయనతార, ప్రభాస్, అనుష్క ఇలా ఎంతోమంది గురించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పిన వాస్తవాన్ని ఇప్పటివరకు జరుగుతూనే ఉన్నాయి.

అయితే ఈయన జ్యోతిష్యం చెప్పడమే కాకుండా… టాలీవుడ్ సెలబ్రిటీ లైన్లో… ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. సినిమాలలో చాన్సులు వచ్చేందుకు… అలాగే ఇండస్ట్రీలో హిట్ అయ్యేందుకు ఇలా ఎన్నో వాటికి… రాజశ్యామల యాగం పేరుతో అనేక పూజలు చేస్తారు వేణు స్వామి. ఇందులో భాగంగానే తాజాగా టాలీవుడ్ హీరోయిన్.. డింపుల్ హయాతి ఫ్లాట్ లో ప్రత్యేక పూజలు చేశారు జ్యోతిష్యుడు వేణు స్వామి. మొన్న శుక్రవారం రోజున… డింపుల్ హాయాతి ఇంట్లో ప్రత్యేక పూజలు చేసిన వేణు స్వామి… ఆమెకు ప్రత్యేక దీవెనలు అందించారు.
అయితే ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఓ ఐపీఎస్ అధికారితో డింపుల్ హయాతి గొడవ పెట్టుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆ వివాదం నుంచి తనకు ఉపశమనం కలిగేందుకు… డింపుల్ హయాతి… వేణు స్వామి తో పూజలు చేయించుకుందని సమాచారం అందుతుంది. అయితే దీనిపై అసలు విషయం తెలియ రాలేదు. మొత్తానికైతే డింపుల్ హయాతి ఇంట్లో వేణు స్వామి చేసిన పూజలకు సంబంధించిన వీడియోలు మరియు ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.