Papaya: బొప్పాయి తో పాటు వీటిని కలిపి తింటున్నారా.. అయితే ప్రమాదమే..!!

Papaya

Do you eat these together with papaya but it is dangerous

Papaya: బొప్పాయిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. మరి ముఖ్యంగా అందం కోసం పరితపించేవాళ్ళు ప్రతిరోజు పండిన బొప్పాయిని వారి డైట్ లో భాగం చేసుకుంటారు.అలాంటి బొప్పాయిని ప్రెగ్నెన్సీలో తినకూడదు అని పెద్దవాళ్ళు చెబుతుంటారు. ఇక ఈ విషయం పక్కన పెడితే..బొప్పాయి పండు ని తినేటప్పుడు ఈ ఆహార పదార్థాలను అస్సలు బొప్పాయి పండుతో కలిపి తినకూడదట.

Papaya

ఒకవేళ తింటే ఆరోగ్యానికి చాలా హానికరం అంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి బొప్పాయిని వేటితో కలిపి తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.బొప్పాయి (Papaya) ని లంచ్ చేసేటప్పుడు లేదా డిన్నర్ చేసేటప్పుడు అస్సలు తినకూడదట. స్పైసి ఫుడ్ తినేటప్పుడు బొప్పాయిని అందులో భాగం చేసుకోవడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన ఇబ్బందులు వస్తాయట.

అలాగే విటమిన్ సి ఉండే పండ్లు, పుల్లటి పండ్లతో బొప్పాయిని కలిపి తినకూడదట. ఉదాహరణకు నిమ్మకాయ వంటి వాటితో బొప్పాయిని కలిపి తినడం వల్ల జీర్ణక్రియలో ఇబ్బందులు తలెత్తి అజీర్ణం వంటి సమస్యలు వస్తాయట. మరీ ముఖ్యంగా బొప్పాయి తినేటప్పుడు పాలు, పాల ఉత్పత్తులతో అస్సలు తినకూడదట.

బొప్పాయిని వీటితో గనుక కలుపుకొని తింటే గుండెలో మంట, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయట. అలాగే బొప్పాయి తినేటప్పుడు ద్రాక్ష పళ్ళను కలిపి తినకూడదు. ఇలా తినడం వల్ల కూడా అజీర్ణం సమస్య వస్తుంది. అందుకే బొప్పాయి తినేటప్పుడు ఇప్పుడు చెప్పిన ఆహార పదార్థాలతో కలిపి తినకూడదు.