Laxmi Parvathi : కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ కు టీడీపీ బాధ్యతలు

Laxmi Parvathi
Laxmi Parvathi

Laxmi Parvathi comments on tdp party

Laxmi Parvathi :  తెలుగు దేశం పార్టీ మరియు నందమూరి కుటుంబాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ పార్టీ కీలక నేత, తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మి పార్వతి.నెల్లూరు జిల్లాలో నిర్వహించిన ప్రెస్‌ మీట్‌ లో తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మి పార్వతి మాట్లాడుతూ….. చంద్రబాబు హయాంలో సెల్ఫ్ డబ్బా తప్ప.. అభివృద్ది శూన్యం అంటూ రెచ్చిపోయారు. టీడీపీ పార్టీ నందమూరి కుటుంబానికి అప్పగించాలని డిమాండ్‌ చేశారు తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మి పార్వతి.

ఎన్నో కష్టాలు పడిన వైఎస్ జగన్ కు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారని గుర్తు చేసిన తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మి పార్వతి….. టిడిపి హయాంలో చంద్రబాబు ధనవంతుడు అయ్యాడే తప్ప.. నిరుపేదలు అలాగే ఉన్నారని ఆగ్రహించారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చెయ్యలేదని ఫైర్‌ అయిన లక్ష్మీ పార్వతి… పుత్రుడు, దత్త పుత్రుడు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినా.. ప్రజలు నమ్మరని నిప్పులు చెరిగారు.

NTR మనవడు గా నారా లోకేష్ ను ప్రజలు రిసీవ్ చేసుకోవడం లేదు.. నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందంటూ చురకలు అంటించారు తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మి పార్వతి. నారా చంద్రబాబు నాయడు ఇసుక మీద 4 వేల కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించారని సంచలన ఆరోపణలు చేశారు లక్ష్మీ పార్వతి. చంద్రబాబు సైకో, శాడిస్ట్ కాబట్టే.. ప్రశ్నించే వారిని గుర్రాలతో తొక్కించారు..తహశీల్దార్ వనజాక్షినీ బెదిరించాడని… నాయి బ్రాహ్మణులను జైల్లో పెడతానని బెదిరించాడని ఆగ్రహించారు.

నారా లోకేష్ అయోమయంలో మాట్లాడుతున్నారమని ఎద్దేవా చేశారు. టిడిపి ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వైసీపీ హయాంలో జరిగినట్లు విమర్శలు చేస్తున్నారని… అధికారంలోకి రాక ముందే దత్త పుత్రుడు, సొంత పుత్రుడు చంపుతా, నరుకుతా, బట్టలు విప్పి కొడతా అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మి పార్వతి. తెలుగు దేశం పార్టీని నందమూరి కుటుంబానికి అప్పగించాలని… కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్.టి.ఆర్. లకు పార్టీ పగ్గాలు అప్పగించాలని కొత్త డిమాండ్‌ ను తెరపైకి తీసుకొచ్చారు తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మి పార్వతి.