Sridevi daughter Khushi Kapoor secret affair with that singer..?
Khushi Kapoor: ఖుషి కపూర్.. ఈ పేరు వినగానే ఈమె ఎవరో మీకు వెంటనే గుర్తు రాకపోవచ్చు.. కానీ దివంగత నటి శ్రీదేవి కూతురు అంటే మాత్రం వెంటనే గుర్తుపట్టేస్తారు. శ్రీదేవి ఇద్దరు కూతుర్లలో ఒకరైన జాన్వి కపూర్ ఇప్పటికే బాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం కానుంది.
ఇక శ్రీదేవి రెండో కూతురు ఖుషి కపూర్ సైతం బి టౌన్ ఎంట్రీ కి సిద్ధమైంది. బాలీవుడ్ దర్శకుడు జోయా అక్తర్ తెరకెక్కిస్తున్న ” ది ఆర్చిస్” సినిమాలో షారుక్ కూతురు సుహానాతో పాటు శ్రీదేవి కూతురు ఖుషి కపూర్ కూడా నటిస్తోంది. కొత్త వాళ్లతో ఈ సినిమా చేస్తోంది జోయా అక్తర్. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా టీజర్ కూడా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాని నేరుగా నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయబోతున్నారు.
ఈ టీజర్ గమనిస్తే 1964 లో కాలేజీ లెవెల్ లో స్నేహితుల మధ్య జరిగే కథగా తెలుస్తోంది. ఖుషి కపూర్ కి ఇదే డెబ్యూట్ సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపద్యంలోనే ఖుషి కపూర్ ప్రేమ వ్యవహారం మరోసారి బి టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలంగా ఖుషి కపూర్ పంజాబీ సింగర్ ఏపీ థిల్లాన్ తో డేటింగ్ చేస్తున్నట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఇటీవల విడుదల చేసిన కొత్త పాటల సాహిత్యం, అతని సింగింగ్ పై ప్రశంసలు కురిపించింది ఖుషి. దీంతో ఆమె ప్రశంసలు కురిపించిన తీరు ఇప్పుడు వీరిద్దరి మధ్య డేటింగ్ పుకార్లకు దారితీసింది. వీరు ప్రేమలో ఉన్నారని, సీక్రెట్ గా కలుసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారని అంటున్నారు ఫ్యాన్స్. ఇందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది.