Tourist Place : వర్షాకాలంలో కచ్చితంగా చూడవలసిన మూడు పర్యాటక ప్రదేశాలు..ఏంటంటే..?

Tourist Place

Three Tourist Places that must be visited during the rainy seson what are

Tourist Place: పర్యాటక ప్రదేశాలు అంటే చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంతో చూస్తూ ఉంటారు.ఇక ఈ పర్యాటక ప్రదేశాలు అంటేనే చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తాయి. అందమైన పర్యాటక ప్రదేశాలను చూస్తూ ఉంటే మనసుకు ఏదో తెలియని ఫీలింగ్ ఉంటుంది.అందుకే వర్షాకాలంలో చాలామంది రకరకాల టూరిస్ట్ ప్లేస్ లకి వెళ్లి ఆస్వాదిస్తూ ఉంటారు. అయితే వర్షాకాలంలో చూడదగిన 3 పర్యాటక ప్రదేశాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Tourist Place

భారత దేశంలో ఎన్నో రకాల పర్యటక ప్రదేశాలు ఉన్నాయి.అందులో ఒకటి చిరపుంజి (Chirapunji).. మేఘాలయలో ఉండే చిరపుంజి లో ఏడాది పొడవున వర్షం కురిసినప్పటికీ వర్షాకాలంలో మాత్రం చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. కొండలపై నుంచి జారే జలపాతాలు చూస్తే ప్రతి ఒక్క చూపరులను ఆకట్టుకుంటాయి. అలాగే పచ్చని వర్షారణ్యాలలో ట్రిక్కింగ్ చాలా సరదాగా అనిపిస్తుంది.అందుకే వర్షాకాలంలో పర్యాటక ప్రదేశమైన చిరపుంజిని చూడడానికి ఎక్కడెక్కడి నుండో పర్యాటకులు వస్తారు.

Tourist Place

అలాగే ముంబైకి సమీపంలో ఉండే లోనవాలా (Lonavala) వర్షాకాలంలో చూడదగిన మరొక టూరిస్ట్ ప్లేస్. ఇక లోనావాలా చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు కన్నార్పకుండా ఆ ప్రకృతి అందాలను చూస్తూనే ఉంటారు. ఇక్కడ కొండ ప్రాంతాలు ఎప్పుడూ కూడా పొగ మంచుతో కనిపిస్తూ ఉంటాయి.అలాగే పచ్చటి పొదల మధ్యలో నుండి తెల్లని పారలా జాలువారే జలపాతాలు పర్యటకులను ఆకట్టుకుంటాయి.

Tourist Place

ఇవే కాకుండా వర్షాకాలంలో చూడదగిన మరొక టూరిస్ట్ ప్లేస్ తమిళనాడులోని హిల్ స్టేషన్ కొడైకెనాల్ (Hill station kodaicanal)  .ఇక వర్షాకాలంలో ఇక్కడికి కూడా చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు.ఇక్కడ ప్రకృతి రమణీయతను చూసి మైమరచి పోతుంటారు. పొగ మంచుతో కూడిన కొండలు,నిత్యం సరస్సుల గలగల ధ్వనులతో,అందమైన అడవులతో చూపరులను ఆకట్టుకుంటుంది. అలాగే హిల్ స్టేషన్ కొడైకెనాల్ చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు సరస్సులో బోటింగ్ చేయకుండా వెళ్లరు. ఇక్కడ కొండ ప్రాంతాలు వర్షాకాలంలో చాలా సుందరంగా కనిపించి అందరినీ ఆకట్టుకుంటాయి.