Vijay – Rashmika : విజయ్‌ – రష్మిక ఎంగేజ్మెంట్‌ డేట్‌ ఫిక్స్‌ ?

Vijay - Rashmika
Vijay - Rashmika

Vijay – Rashmika engagement date fixed

Vijay – Rashmika : ప్రస్తుతం మన తెలుగు చిత్ర పరిశ్రమలో… సినీ తారలు వరుసగా పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ మరియు నాగశౌర్య లాంటి స్టార్ హీరోలు ఇటీవల కాలంలో అంటే సమ్మర్ సీజన్ లో… పెళ్లి చేసేసుకున్నారు. ఇలాంటి తరుణంలోనే మెగా హీరో వరుణ్ తేజ్ కూడా తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టి… టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిను పెళ్లి చేసుకునేందుకు… సంసిద్ధమయ్యాడు.

లావణ్య త్రిపాఠి మరియు హీరో వరుణ్ తేజ్ ల వివాహ కార్యక్రమం మరికొన్ని రోజుల్లోనే జరగనుంది. ఈ తరుణంలోని టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ( Vijay dewarakonda) మరియు టాలీవుడ్ క్రష్ హీరోయిన్ రష్మిక మందాన ( Rashmika) కూడా త్వరలోనే పెళ్లి పీటలు ప్రాథమిక సమాచారం అందుతోంది. వీరిద్దరి వివాహం పై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి.

Vijay - Rashmika
Vijay – Rashmika

విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందాన గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నారని ఇప్పటికే పలు మీడియా సంస్థలలో మరియు సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే. ఈ వార్తలు తగ్గట్టుగానే వీరిద్దరూ… చాలాసార్లు విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేశారు. కానీ వారిపై వచ్చిన వార్తలపై విజయ్ దేవరకొండ కానీ లేక రష్మిక మందన కానీ.. ఇప్పటివరకు స్పందించలేదు. దీంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉన్న వార్తలకు బలం చేకూరినట్లైంది.

ఇక తాజాగా విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందాన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని… వీరు ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి కూడా ముహూర్తం ఫిక్స్ అయిందని… సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. వీరిద్దరి వివాహానికి ఇరు కుటుంబాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని… త్వరలోనే ఎంగేజ్మెంట్ జరిగాక, మంచి సంవత్సరం వీరి వివాహం కూడా ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై ఏ మేరకు వాస్తవం ఉన్నదో తెలియాల్సి ఉంది.