Coconut: Debts are bothering you a lot but do this with Coconut
Coconut : ప్రతి ఒక్కరికి అప్పులు అనేవి ఉంటాయి. కొంతమంది దొంగ దారిన డబ్బు సంపాదించి కోటీశ్వరులు అవుతూ ఉంటే చాలామంది న్యాయపరంగా పనిచేసినప్పటికీ చేసిన పనికి తగ్గ ఫలితం ఉండకపోవడంతో అప్పుల బారిన పడుతారు.ఇలా అప్పులు అనేది ఒకసారి అప్పు చేస్తే అది పెరుగుతూ పోతూనే ఉంటుంది. ఒకరి దగ్గర తెచ్చిన అప్పు తీర్చడానికి మరొకరి దగ్గర అప్పు చేస్తూ ఇలా అప్పులు పెరుగుతూనే ఉంటాయి.
ఇక చాలామంది ఈ రుణ బాధలతో ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటారు. ఇంకొంత మంది అయితే అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా మనం చాలానే చూసాం. మరి అలాంటి వారికోసం ఇప్పుడు ఒక చక్కటి పరిష్కారం చూద్దాం. ఇక ఈ పరిహారం చేయడం వల్ల కొంతమేరకు అప్పుల బాధలు తగ్గుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
అయితే ఈ పరిహార పూజ అనేది కొబ్బరికాయ (Coconut ) తో చేస్తే మంచి ఫలితం ఉంటుంది.మరి కొబ్బరికాయతో ఆ పరిహార పూజ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది అప్పుల బాధలు తీరాలని ఎన్నో రకాలుగా కష్టపడుతూనే ఆ దేవున్ని కూడా వేడుకుంటూ ఉంటారు.అయితే ఒక్కొక్కసారి మనం ఎన్ని పూజలు చేసినా కూడా ఫలితం లేకుండా పోతుంది.
అయితే అలాంటివారు ఒక కొబ్బరికాయను తీసుకొని దానిని పసుపు వస్త్రంలో చుట్టి ఆ అమ్మవారు అంటే శ్రీమహాలక్ష్మి కాళ్ల దగ్గర పెట్టి రుణ బాధలు తొలగిపోవాలి అని వేడుకోండి.ఇక ఇలా గనక చేస్తే అప్పుల బాధలు తీరిపోవడమే కాకుండా ఆ శ్రీ మహాలక్ష్మి దీవెనలు మన కుటుంబం పై ఎల్లప్పుడూ ఉండి మనం చేసే పనుల్లో సక్సెస్ సాధిస్తాం. అందుకే అప్పుల బాధ నుండి విముక్తి కావడానికి ఒకసారి దీన్ని పాటించండి.