Star heroine Hamsa Nandini will say goodbye to movies..!
Hamsa Nandini: 2004లో ఒక్కటవుదాం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన పూణే కు చెందిన హంస నందిని గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆ తరువాత వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన అనుమానాస్పదం మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది హంస. ఆ తర్వాత ప్రవరాఖ్యుడు, అధినేత, ఆహనా పెళ్ళంట, ఈగ వంటి సినిమాలలో నటించింది.
అయితే ఈమెకి స్పెషల్ సాంగ్స్ ద్వారానే మంచి గుర్తింపు లభించింది. టాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ కి ఒకనాడు కేరఫ్ అడ్రస్ గా ఉండేది హంస నందిని. మిర్చి, అత్తారింటికి దారేది, భాయ్, రామయ్య వస్తావయ్య, లెజెండ్, లౌక్యం, బెంగాల్ టైగర్, సోగ్గాడే చిన్నినాయన, శ్రీరస్తు శుభమస్తు తో పాటు మరికొన్ని సినిమాలలో ఐటెం సాంగ్స్ చేసింది. ఇక ఈమె చివరగా గోపీచంద్ తో కలిసి పంతం సినిమాలో కనిపించింది.
అయితే ఈమె క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. దాదాపు ఏడాది పాటు క్యాన్సర్ తో పోరాడిన హంస నందిని 16 సైకిల్స్ కీమోథెరపీ తర్వాత దాన్ని జయించింది. అయితే చాలాసార్లు కీమోథెరపీ తీసుకొని గుర్తుపట్టకుండా మారింది. ఇక ఈమె ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి.
ఏడాది పాటు క్యాన్సర్ తో పోరాడి ప్రాణాలతో బయటపడిన హంస ఇక సినిమాలలో నటించకూడదని నిర్ణయించుకుందట. ఇది నిజంగా ప్రేక్షకులకు షాక్ ఇచ్చే విషయమే. కానీ ప్రేక్షకులు మాత్రం ఈమె గతంలో మాదిరిగానే మళ్లీ అలరించాలని ఆశిస్తున్నారు. మరి హంస నందిని ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.