Kajal Aggarwal husband conditions
Kajal Aggarwal : టాలీవుడ్ సినిమాలోకి ఎంతమంది హీరోయిన్లు వచ్చినా.. ఎంత రచ్చ చేసినా…. స్టార్ హీరోయిన్స్ కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal ) కు ఉన్న క్రేజ్ ఎవరికి దక్కదు అన్న వాస్తవం నిజం. ఈ బ్యూటీ… ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 15 ఏళ్లు దాటిన.. ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. 2007 సంవత్సరంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో…. తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది చందమామ కాజల్ అగర్వాల్.
మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ బ్యూటీ… ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళింది. లక్ష్మీ కళ్యాణం సినిమా అనంతరం చందమామ అనే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందించిన సినిమాలో ఛాన్స్ కొట్టేసి అద్భుత విజయాన్ని అందుకుంది కాజల్ అగర్వాల్. చందమామ సినిమా చేసిన తర్వాత కాజల్ అగర్వాల్ కు చందమామ అనే పేరు కూడా వచ్చింది. ఇక ఆ తర్వాత ఆమె వెనక్కి తిరగకుండా.. టాలీవుడ్ చిత్రపరిషన్లో దూసుకుపోయింది.

రామ్ చరణ్ తో మగధీర సినిమా చేసి టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్గా ఎదిగిపోయింది ఈ బ్యూటీ. ఆ తర్వాత ఆర్య 2, బృందావనం, డార్లింగ్, మిస్టర్ ఫర్ఫెక్ట్, బిజినెస్ మాన్ ఇలాంటి ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి ఇప్పటికీ తన క్రేజ్ ఏమాత్రం తగ్గించుకోలేకపోయింది చందమామ కాజల్ అగర్వాల్. ఇక లాక్ డౌన్ సమయంలో… గౌతమ్ కిచులు అనే ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న కాజల్… ఇటీవల ఓ పని నుండి బిడ్డకు కూడా జన్మనిచ్చింది.
ఇలాంటి తరుణంలో కాజల్ అగర్వాల్ గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పెళ్లికి ముందు ఆమె భర్త గౌతం.. కాజల్ అగర్వాల్ కు కొన్ని కండిషన్స్ పెట్టాడట. ఆ కండిషన్స్ ఫాలో అవుతేనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడట గౌతమ్. సినిమా షూటింగులు, సినిమాలు అంటూ ఎంత బిజీగా ఉన్నా… తనతో ప్రతిరోజు ఒక గంట గడపాలని, అలా అయితేనే నిన్ను పెళ్లి చేసుకుంటానని కాజల్ కు వివరించాడట గౌతం. దీనికి కాజల్ అగర్వాల్ ఒప్పుకోవడంతో వారిద్దరి వివాహం జరిగిందట. ఇప్పటికీ గౌతం పెట్టిన ఆ కండిషన్స్ ఫాలో అవుతుందట కాజల్ అగర్వాల్.