y category security for Etela Rajender
Etela Rajender : మాజీ మంత్రి, హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గురించి తెలియని వారు ఉండరు. తెలంగాణ కోసం ఉద్యమంలో సీఎం కేసీఆర్ తో పాటు పోరాటం చేసిన కీలక ఈటలరాజేందర్. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల… ఈటల రాజేందర్ ను తెలంగాణ కేబినెట్ నుంచి సీఎం కేసీఆర్ బహిష్కరించిన సంగతి తెలిసిందే. తెలంగాణ కేబినెట్ నుంచే కాకుండా పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు సీఎం కేసీఆర్. దీంతో మూడేళ్ల కిందట బిజెపి తీర్థం పుచ్చుకున్న ఈటెల రాజేందర్… హుజురాబాద్ ఎమ్మెల్యేగా మరోసారి గెలిచి సీఎం కేసీఆర్ కు ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు.
ఇక గత మూడేళ్లుగా బిజెపిలో ఉంటున్న ఈటల రాజేందర్… మొన్నటి నుంచి కాస్త అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. బిజెపి పార్టీని వీడి… కాంగ్రెస్ పార్టీలో ఈటల రాజేందర్ చేరతారని కొంత మంది ప్రచారం చేశారు. ఇలాంటి తరుణంలోనే బిజెపి అధిష్టానం… ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను ఢిల్లీకి పిలిపించుకుంది. ఈటల రాజేందర్ ( Etela Rajender ) తో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లి బిజెపి పెద్దలను కలిశారు. ఈ సంఘటన అంతా రెండు రోజుల కిందట వరకు జరిగింది.

దీంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. తాను బిజెపి పార్టీలోనే ఉంటానని.. తనను కష్టాల్లో కాపాడిన పార్టీ భారత జనతా పార్టీ అని ఈటల రాజేందర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి కుండబద్దలు కొట్టాడు. అటు ఈటల రాజేందర్ భార్య ఈటల జమున కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈటల రాజేందర్ ఇప్పటికీ అయితే, భారతీయ జనతా పార్టీలో ఉంటారని తేలిపోయింది. అయితే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈ వ్యాఖ్యలు చేసిన అనంతరం కేంద్ర ప్రభుత్వం ఈటల రాజేందర్ కు అదిరిపోయే శుభవార్త చెప్పింది.
ఈటల రాజేందర్ కు కేంద్ర బలగాలతో Y కేటగిరి భద్రత కల్పించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక ఆదేశాలు జారీ చేశారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట. దీంతో ఈటల రాజేందర్ శిబిరం ఫుల్ కుశిలో ఉంది. ఇక అటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈటల రాజేందర్ కోరిక భద్రత కల్పిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కాగా నిన్న మీడియాతో మాట్లాడిన జమున… తన భర్తకు ప్రాణహాని ఉందని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.