Beauty Tips: మొటిమల మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ చిట్కా పాటించండి..!!

Beauty Tips

Beauty Tips:Are you suffering from acne scars but follow this tip

Beauty Tips: చాలామంది అమ్మాయిలు మొహం చాలా స్మూత్ గా కాంతివంతంగా ఉండాలి అని భావిస్తూ ఉంటారు. కానీ అందర్నీ వేధించే సమస్య ఒకటే. అదే మొటిమలు,మొటిమల తాలూకా మచ్చలు.వీటి వల్ల ఎంతో మంది అమ్మాయిలు చాలా నామూషిగా ఫీల్ అవుతారు. నలుగురిలో కలవడానికి కూడా అంతగా ఇష్టపడరు. ఇక ఆ మొటిమలను, మచ్చలను తగ్గించుకోవడానికి రకరకాల క్రీములు పెట్టుకుంటూ ఉంటారు.

Beauty Tips

అయితే అవేవీ వాడకుండా నేచురల్ గా ఇంట్లోనే ఈ చిట్కా కనుక పాటిస్తే మంచి ఫలితం ఉంటుందట. మరి ఆ చిట్కా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి నీళ్లు మరిగాక టీ పౌడర్ అందులో వేసి డికాక్షన్ అయ్యాక దాన్ని వడపోసి పక్కన పెట్టుకోవాలి.

ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ లో తొక్క తీసిన బంగాళదుంప, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల సెనగపిండి, అలాగే పక్కకు మరిగించి పెట్టుకున్న డికాక్షన్ ఐదు టేబుల్ స్పూన్లు వేసుకొని మెత్తటి పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి. ఇక మెత్తటి మిశ్రమం తయారయ్యాక అందులో ఒక టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్,మరో టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి.

ఆ తర్వాత దీన్ని మొహానికి అప్లై చేసి 20 నిమిషాలు ఆరనిచ్చి ఆ తర్వాత చల్లటి నీళ్లతో కడిగేస్తే అందమైన నిగరింపు గల మొహం మీ సొంతం. అంతేకాకుండా ఈ చిట్కాని రోజుకి ఒకసారి గనుక పాటిస్తే మొహం మీద ఉండే మొటిమల తాలూకు మచ్చలు నెల రోజుల్లోనే తగ్గుముఖం పడతాయి.