Padmajayanti: వేణుమాధవ్ నిజస్వరూపం బయటపెట్టిన సీనియర్ నటి..!

padmajayanti

senior actress padmajayanti has revealed Venumadhav true nature..!

padmajayanti: దివంగత కమెడియన్ వేణుమాధవ్ గురించి, ఆయన కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ మరియు డైలాగ్ డెలివరీతో వేణుమాధవ్ పుట్టించే కామెడీకి ఎవరైనా పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వాల్సిందే. అందుకే ఆయన అంతటి స్థానాన్ని దక్కించుకున్నారు. చేతినిండా సినిమాలతో ఎప్పుడూ బిజీ లైఫ్ లీడ్ చేసిన వేణుమాధవ్.. లివర్ సమస్య వల్ల ప్రాణాలు కోల్పోయి నేడు మన మధ్య లేరు.

అయినప్పటికీ ఆయన పోషించిన అద్భుతమైన పాత్రల ద్వారా చిరస్థాయిగా మన మధ్య బ్రతికి ఉండి మనల్ని నవ్విస్తూనే ఉంటారు. అయితే కొంతకాలం క్రితం వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలలో బిజీగా కనిపించిన పద్మ జయంతి మీకు గుర్తుండే ఉంటుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన పద్మజయంతి తన కెరీర్ గురించి, వేణుమాధవ్ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేసింది. వేణుమాధవ్ మాస్టర్ మూవీ ద్వారా పరిచయం అయ్యారని చెప్పుకొచ్చింది.

వేణుమాధవ్ తమకు బంధువు కాదని.. కానీ తమ ఇంటి దగ్గరలోనే ఉండేవారని తెలిపింది. తనకి సినిమాలలో ఆఫర్లు ఇస్తానని చెప్పి వేణుమాధవ్ మోసం చేశారని చెప్పుకొచ్చింది పద్మ జయంతి. తన భర్త స్నేహితుడి ద్వారా వేణుమాధవ్ పరిచయమయ్యారని.. అలా అతనితో ఫ్రెండ్షిప్ ఏర్పడిందని తెలిపింది. ఆ సమయంలో ఆయనకి ఇంకా పెళ్లి కాలేదని చెప్పుకొచ్చింది. ” ఓ సమయంలో ఆయనకి ఆరోగ్యం బాగా లేకపోతే మా ఇంటి నుండే క్యారియర్ పంపించమని మా వారికి ఫోన్ చేశారు. అలా అప్పుడప్పుడు షూటింగ్స్ నుండి కూడా ఫోన్ చేసేవారు.

అప్పుడు మా వారు క్యారియర్ తీసుకుని వెళుతుండేవారు. ఇలా రోజు వేణుమాధవ్ గారికి మా ఇంటి నుండి క్యారియర్ వెళ్లడంతో అంతా తప్పుగా అనుకోవడానికి దారితీసింది. నాకు సినిమాలలో ఏదైనా అవకాశం చెబుతాడేమోనని స్వార్థంతోనే నేను కూడా ఆలోచించాను. కానీ వేణుమాధవ్ ద్వారా నాకు ఎటువంటి వేషం దక్కలేదు. అంతేకాకుండా అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి నా దగ్గర నుండి డబ్బులు కూడా తీసుకున్నారు. ఆ డబ్బులు మళ్ళీ తిరిగి ఇవ్వలేదు కూడా” అంటూ చెప్పుకొచ్చింది.