CM Jagan Huge Shock To Ministers
CM Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్నదన్న సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి… ముందస్తు ఎన్నికలకు వెళతారని ఇప్పటికీ ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు అయిన తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి పేరుతో ప్రచారం చేస్తుంటే… నారా లోకేష్ మాత్రం పాదయాత్ర పేరుతో జనాల్లోకి వెళ్తున్నారు. ఇక అటు ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొనేందుకు… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి… వ్యూహరచనలు చేస్తున్నారు. ప్రతిరోజు ముఖ్య నేతలతో సమావేశమై… గ్రౌండ్ స్థాయిలో వైసిపి పార్టీ ఎలా ఉంది అనే దానిపై చర్చిస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ( CM Jagan ).

అలాగే పార్టీ కీలక బాధ్యతలను మరోసారి విజయసాయి రెడ్డి గారికి అప్పగించి… ముందుకు వెళ్తున్నారు సీఎం జగన్. ఇక ఈ నేపథ్యంలోనే… వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలి ? ఎవరికి టికెట్ ఇవ్వకూడదు అనేదానిపై కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రౌండ్ స్థాయిలో రిపోర్ట్స్ తెప్పించుకొని మరి… ఎవరికి టికెట్లు ఇవ్వాలని దానిపై చర్చిస్తున్నారు సీఎం జగన్. ఇక ఈ లెక్కల్లో ఇద్దరు మంత్రులకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని నిర్ణయం తీసుకున్నారట సీఎం జగన్. అందులో జోగి రమేష్ మరియు ఉషశ్రీ చరణ్.
జోగు రమేష్ కృష్ణాజిల్లాకు చెందిన మంత్రి అయితే… ఉషశ్రీ చరణ్ అనంతపూర్ జిల్లాకు చెందినవారు. వీరిద్దరిపై గ్రౌండ్ స్థాయిలో సర్వే చేయించిన సీఎం జగన్…. వారికి టికెట్ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పేర్ని నానికి కూడా టికెట్ ఇవ్వకుండా ఆయన కుమారుడికి టికెట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారట. పేర్ని నాని విజ్ఞప్తి మేరకు… ఈ నిర్ణయం తీసుకున్నారట సీఎం జగన్.