Spirituality:Your wife is pregnent but dont do these things even by mistake
Spirituality: తల్లి కావడం అనేది ఒక కల.. తల్లి కానిదే ఆడజన్మకి పరిపూర్ణత రాదు అంటుంటారు.అలాంటిది ప్రతి భార్యాభర్తలు తల్లిదండ్రులు అవ్వాలని కోరుకుంటారు.అయితే ఒకవేళ మీ భార్య గర్భవతి అయితే ఇంట్లో ఆ భర్త ఈ పనులు అస్సలు చేయకూడదట. మరి గర్భవతిగా ఉన్న భార్య ఇంట్లో ఉన్నప్పుడు ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
అన్నింటికంటే ముందుగా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టేది మగ బిడ్డ ఆడబిడ్డ అనేది తెలుసుకోవడం చట్టరీత్యా నేరం. ఎవరైనా మన రక్తం పంచుకు పుడుతున్న బిడ్డ కాబట్టి మనం వారిని బిడ్డగా స్వీకరించాలి.అంతేకానీ లింగ వివక్షత చూపిస్తూ ఆడపిల్ల అయితే అబార్షన్ చేయించడం వంటివి చేయకూడదు. అలాగే భార్య గర్భవతి అయితే చావులకు పిండ ప్రదానాలు వంటివి చేయకూడదు.
అంతేకాకుండా భార్యకు 7 నెలల పడ్డాక ఆ భర్త క్షవరం చేయించుకోవడం,నది ప్రయాణం చేయడం వంటివి కూడా చేయకూడదు.అంతేకాకుండా దేవుడికి కొబ్బరికాయ కొట్టడం, పుణ్యక్షేత్రాలు దర్శించడం, శఠ గోపం పెట్టించుకోవడం వంటివి మానుకోవడం మంచిది. ఇక భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆ భార్యపై చేయి వేస్తే చాలా పాపమట.ఇలా చేస్తే ఆ భర్తకి ఎక్కడలేని పాపాలు చుట్టుకుంటాయట.
అలాగే గర్భవతిగా ఉన్న భార్యను చాలా ప్రేమగా అడిగింది లేదు అనకుండా తెచ్చి ఇవ్వాలి. అలా అయితేనే పుట్టబోయే బిడ్డ చాలా ఆరోగ్యంగా పుడుతుంది. అంతేకాకుండా కడుపుతో ఉన్న భార్య ఇంట్లో ఉన్నప్పుడు సిగరెట్ వంటివి అస్సలు తాగకూడదు. ఈ సిగరెట్ పొగ వల్ల కాల్చిన మీకు మాత్రమే కాకుండా పీల్చిన మీ భార్య కు కడుపులో ఉన్న మీ బిడ్డకు కూడా ప్రమాదమే. అందుకే భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఈ పనులు అస్సలు చేయకూడదు.