If you do that will the snakes really get angry
Snakes: మనదేశంలో పాముల్ని దేవుళ్ళుగా పూజిస్తారు. కానీ చైనా లాంటి దేశాలలో వాటిని వండుకొని తినేస్తారు. అయితే అలాంటి పాములు పగబడతాయి అని మన దేశంలో చాలామంది నమ్ముతూ ఉంటారు. అయితే వీటిని కొంతమంది మూఢనమ్మకాలు అంటే మరి కొంత మంది నిజమే అని భావిస్తూ ఉంటారు. అయితే ఇందులో కొంతమంది నాస్తికులు అయితే చైనాలో పాములు వండుకొని తింటారు మరి వారిని ఎందుకు పగబట్టవు అని అంటూ ఉంటారు.
అయితే పాములు నిజంగానే పగబడతాయట. మరి పాలు పోసి పూజ చేసి దేవుళ్ళుగా కొలిచే ఆ పాములు పగబడితే ఎలా అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే పాములు ఊరికే ఏమీ పగబట్టవు. వాటికి హాని కలిగిస్తేనే పగపడతాయట.ఎవరైతే పాము పిల్లలకి హాని కలిగించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారో అలాంటి వారిని గుర్తుపెట్టుకొని మరీ పగబడతాయి అంటూ కొంతమంది అంటున్నారు.
అయితే ఇందులో కొంత వరకు నిజం ఉందంటే మరి కొంత వరకు అబద్ధం ఉంది అని అడ్డు చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మనుషుల ప్రవర్తనను బట్టి పాము కూడా ప్రవర్తిస్తుందట. వాటికి హాని చేయాలని చూసే వాళ్ళను పాము నిజంగానే గుర్తుపెట్టుకొని పగబట్టి కాటేస్తుంది అని అంటున్నారు.
ఇక ఇలాంటి విషయాలు మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం.అయితే చాలామంది పాములు కనిపించడంతోనే అవి ఎలాంటి ప్రాణహాని కలిగిస్తాయో అనే భయంతో వాటిని కొట్టడానికి పెద్ద పెద్ద కర్రలు ఉపయోగిస్తారు. ఇక అదే నేపథ్యంలో పాములు కూడా మనుషులు వాటికి ఎలాంటి హాని చేస్తాయో అన్న భయంతో కాటు వేయడానికి ప్రయత్నిస్తాయట.