Soundarya star became heroine because of that person..!
Soundarya: తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేని పేరు సౌందర్య. ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన సౌందర్య కోట్ల మంది అభిమానులను సంపాదించుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. అందానికే అందం, అభినయంతో ఇండియన్ సినిమాని దశాబ్దం పాటు అలరించింది. తెలుగులో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా రాణించింది సౌందర్య. ఓ రకంగా ఆమె లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది.
ఆమెను ఇప్పటికీ, ఎప్పటికీ అభిమానించే వారి సంఖ్య దండిగానే ఉంటుంది. ఎటువంటి పాత్రలోనైనా ఇట్టే జీవించే సౌందర్య నటనకు దాసోహం కాని వారు లేరు. సాంప్రదాయ దుస్తులలోనే ఎక్కువగా కనిపిస్తూ పక్కింటి అమ్మాయిగా పేరు తెచ్చుకుంది సౌందర్య. ఎంతో కెరీర్ ఉన్న ఈ అందాల తార 31 ఏళ్ల వయసులో.. 2004లో ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురై కన్నుమూసింది.
ఇదిలా ఉంటే.. మొదట కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సౌందర్య.. ఆ తరువాత రైతు భారతం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తరువాత వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు, హలో బ్రదర్స్ సినిమాలతో సౌందర్య కి తెలుగులో మంచి పేరు లభించింది. అయితే ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా రాణించడానికి కారణం ఓ వ్యక్తి అంటూ బ్రతికున్నప్పుడు చాలా ఇంటర్వ్యూలలో తెలిపింది సౌందర్య.
ఆయన ఎవరో కాదు సౌందర్య మొదటి సినిమా రచయిత, నిర్మాత త్రిపురనేని మహారధి. ఆయన వల్లే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నానని తెలిపింది. త్రిపురనేని మహారధి దాదాపు 200 చిత్రాలకు రైటర్ గా పనిచేశారు. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ సినిమాలకు ఎక్కువగా రైటర్ గా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే సౌందర్య తో చేసిన రైతు భారతం సినిమా విడుదల కాకపోయినప్పటికీ అదే తన మొదటి సినిమా అని.. ఆయన వల్లే ఇండస్ట్రీలో ఉన్నానంటూ ఆయనకు ధన్యవాదాలు తెలిపింది.