Cm Kcr : ఈటలకు Y కేటగిరీ భద్రత.. సీఎం కేసీఆర్ స్కెచ్ ఇదేనా ?

Cm Kcr
Cm Kcr

Y category safety for Etala Rajendhar

Cm Kcr :  తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులుగా… కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటున్న సమయంలో… బిజెపి పార్టీ మరియు భారత రాష్ట్ర సమితి పార్టీలు కీలక ఎత్తుగడలు వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అటు బిజెపి పార్టీలో కొంతమంది లీడర్లు… అధిష్టానం మరియు తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అధిష్టానం ఎంత చెప్పినప్పటికీ… తమ నిరసనను బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈటల రాజేందర్ మరియు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని… ఢిల్లీకి పిలిపించి మరి అధిష్టానం… కీలక చర్చలు చేసినప్పటికీ… బిజెపిలో మార్పులు రావడం లేదు. అటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా బిజెపి పై కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు వై కేటగిరి భద్రత కల్పించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న అధికారికంగా ప్రకటించింది. ఈటలకు వై కేటగిరి భద్రత కల్పిస్తూ అధికారిగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది కేసీఆర్ సర్కార్.

Cm Kcr
Cm Kcr

బులెట్ ప్రూఫ్ వాహనంతో పాటు 16 మంది సెక్యూరిటీ సిబ్బందిని ఈటల రాజేందర్ కోసం రంగంలోకి దింపింది కేసీఆర్ ప్రభుత్వం. అయితే ఈటల రాజేందర్ పై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల… చాలా అనుమానాలు అందరికీ వస్తున్నాయి. దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటున్న విషయం చాలా వాస్తవం. ఇలాంటి తరుణంలో ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి కీలక నేతలు కాంగ్రెస్ లోకి వెళితే…. బిజెపి పార్టీ మరింత బలహీన పడుతుంది. బిజెపి పార్టీ బలహీన పడితే భారత రాష్ట్ర సమితికి వచ్చే ఎన్నికల్లో కష్టాలు తప్పవు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపి పార్టీలు బలంగా ఉంటే… త్రిముఖ పోటీ కారణంగా భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే చాలా సర్వేలు చెప్పాయి. అయితే దీని దృష్టిలో పెట్టుకొని బిజెపి మరియు సీఎం కేసీఆర్ ( Cm Kcr) వ్యూహరచనలు చేసినట్లు కొంతమంది చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఈటల రాజేందర్ లో అసంతృప్తి తొలగించేలా… అతని కోసం ఏదైనా ఒకటి చేయాలని భారత రాష్ట్ర సమితి తో పాటు బిజెపి పార్టీలు రహస్య ఒప్పందం చేసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఈటల రాజేందర్ కు వై కేటగిరి భద్రత కల్పించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ముందుకు వచ్చిందని చెబుతున్నారు. ఇలా జరిగితే ఈటల రాజేందర్ బీజేపీలోనే ఉండి… పార్టీని ముందుకు తీసుకుపోతాడని బీఆర్ఎస్ మరియు బిజెపి ఆలోచన అన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ వ్యూహం వెనుక అసలు రహస్యం ఏదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.