Ileana : ఎట్టకేలకు ఆ వ్యక్తిని బయటపెట్టిన ఇలియానా.. ప్రెగ్నెంట్ చేసింది ఇతనే..!

Ileana
Ileana

Ileana D’Cruz shares new picture of partner

Ileana :  టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంత మంది హీరోయిన్లు వచ్చిన… గోవా బ్యూటీ స్టార్ హీరోయిన్ ఇలియానా కు ఉన్న క్రేజీ అంతా కాదు. అప్పట్లో టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో చాలా సినిమాలు చేసి అగ్ర హీరోయిన్గా ఎదిగిన గోవా బ్యూటీ స్టార్ హీరోయిన్ ఇలియానా ఇప్పుడు బాలీవుడ్ లోనే వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది. తెలుగులో 2006 సంవత్సరంలో… తొలి సినిమా చేసి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.

2006 సంవత్సరంలో వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో… దేవదాసు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది గోవా బ్యూటీ ఇలియానా. ఈ సినిమాలో హీరో రామ్ సరసన నటించి అదిరిపోయే పర్ఫామెన్స్ తో దూసుకుపోయింది. ఇక ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఈ బ్యూటీకి అనేక ఛాన్సులు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన మహేష్ బాబు పోకిరి సినిమాలో కూడా ఈ బ్యూటీ నటించి అందరిని మెప్పించిందని చెప్పుకోవాలి.

Ileana
Ileana

ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చాలా దూరంగా ఉన్న గోవా బ్యూటీ ఇలియానా.. ప్రస్తుతం తల్లి కాబోతున్న సంగతి మనందరికీ విధేయతమే. దాదాపు రెండు నెలల కిందట తాను ప్రెగ్నెంట్ అంటూ చెప్పకనే చెప్పింది ఇలియానా. బేబీ బంప్ తో ఉన్న ఫోటోను షేర్ చేసి మరి… తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది గోవా బ్యూటీ ఇలియానా. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు తన కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డకు తండ్రి ఎవరో మాత్రం చెప్పలేదు ఇలియానా ( Ileana ).

దీంతో అందరూ ఆమెను ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇలాంటి తరుణంలోనే తాజాగా ఓ సంచలన పోస్టుతో తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో చెప్పగానే చెప్పింది ఇలియానా. ఒక కుక్క ఫోటో ను షేర్ చేసిన ఇలియానా… ఆ కుక్కను పట్టుకొని ఉన్న ఓ వ్యక్తిని కూడా షేర్ చేసింది. కానీ అతని ఫేస్ కనిపించకుండా జాగ్రత్తగా వహించి.. సదర్ ఫోటోను క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో పెట్టింది ఈ బ్యూటీ. ఈ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ కావడంతో… ఇలియానా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆ వ్యక్తి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. త్వరలోనే అతన్ని ఇలియానా పెళ్లి చేసుకోబోతుందని కూడా కొంతమంది చెబుతున్నారు.