Mrunal Thakur Comments Viral
Mrunal Thakur : టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలోకి… ఇతర రాష్ట్రాల నుంచి హీరోయిన్లు వస్తారన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది మాత్రమే తొందరగా ఫేమస్ అయిపోతారు. అలా ఫేమస్ అయినవారిలో సీతారామం సినిమా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఒకరన్న మాట వాస్తవం. ఇటీవల కాలంలో తెలుగులో సీతారామం అనే వచ్చి ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 2022 సంవత్సరంలో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.
మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన మృణాల్ ఠాకూర్ …. మొదటగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. లవ్ సోనియా అనే సినిమాతో 2018 సంవత్సరంలో బాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఇక 2022 లో మన తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి రాణించింది ఈ బ్యూటీ మృణాల్ ఠాకూర్. అయితే తాజాగా మృణాల్ ఠాకూర్.. తన లవ్ ఎఫైర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ ఈ విషయాలను చెప్పింది.

తనకు ఇప్పటికే రెండు బ్రేకప్ లు అయినట్లు వెల్లడించిన మృణాల్ ఠాకూర్… తాను ప్రస్తుతం ఎవరిని ప్రేమించడం లేదని తెలిపింది. స్కూల్ టైం లో… ఒక వ్యక్తి తనను ప్రేమించాడని… అతను చెప్పిన ప్రపోజల్ కు తాను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వెల్లడించింది మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ). అయితే అప్పుడు తన వయసు చాలా చిన్న అని.. లోకజ్ఞానం తెలియకపోవడంతో… అతనితో ప్రేమాయణం నడిపినట్లు తెలిపింది.
పై చదువుల కోసం ముంబై వెళ్లడంతో మా ఇద్దరికీ బ్రేకప్ అయిందని వెల్లడించింది. ఇక సినిమాలకు రాకముందు ఒక అబ్బాయి తో ప్రేమాయణం నడిపినట్లు తెలిపింది మృణాల్ ఠాకూర్. కానీ తమ మధ్య కొన్ని గొడవలు రావడంతో ఇద్దరం విడిపోయినట్లు వివరించింది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. అయితే.. మృణాల్ ఠాకూర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.